close
Choose your channels

పూరి, దేవరకొండ 'లైగర్' అంచనాలు పెంచేసిన హీరోయిన్ తండ్రి

Wednesday, July 28, 2021 • తెలుగు Comments

పూరి, దేవరకొండ లైగర్ అంచనాలు పెంచేసిన హీరోయిన్ తండ్రి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'లైగర్'. హీరోలని మాస్ అండ్ స్టైలిష్ గా ప్రజెంట్ చేయడంలో పూరి దిట్ట. అందుకే ప్రతి హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించాలని భావిస్తారు.

పూరి, దేవరకొండ లైగర్ అంచనాలు పెంచేసిన హీరోయిన్ తండ్రి

లైగర్ చిత్రాన్ని హీరోయిన్ ఛార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కలసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అనన్య పాండే తండ్రి, నటుడు చుంకి పాండే బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లైగర్ మూవీపై అంచనాలు పెంచేశాడు.

పూరి, దేవరకొండ లైగర్ అంచనాలు పెంచేసిన హీరోయిన్ తండ్రి

లైగర్ సినిమా కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ చిత్రం పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందని ముందు నుంచి అనన్యకు చెబుతూనే ఉన్నా. లైగర్ రషెస్ చూశాను. మై గాడ్.. విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ అద్భుతం. విజయ్, అనన్య జోడి పర్ఫెక్ట్ గా ఉంది అని చుంకి పాండే ప్రశంసలు కురిపించాడు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ లాంగ్ హెయిర్ తో విభిన్నమైన లుక్ లో కనిపిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి నుంచి రాబోతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలు పక్కాగా ఉండేలా పూరి ఈ చిత్ర స్క్రిప్ట్ రెడీ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz