ఏప్రిల్ 30న ‘థాంక్యూ బ్రదర్’ ... రిలీజ్ డేట్‌ను ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేసిన అక్కినేని నాగ‌చైత‌న్య‌

  • IndiaGlitz, [Sunday,April 18 2021]

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. ర‌మేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. యువ‌కుడికి, గ‌ర్భ‌వ‌తిగా ఉన్న మ‌హిళ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. వారెలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొంటారు. వారి ఎమోష‌న్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం ట్రైల‌ర్‌ను అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. రెబల్‌స్టార్ ప్ర‌భాస్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, వెర్స‌టైల్ యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి స‌హా నెటిజ‌న్స్ అంద‌రినీ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది.

ఏప్రిల్ 30న విడుద‌ల కానున్న ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం రిలీజ్ డేట్‌ను అక్కినేని నాగ‌చైత‌న్య ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ‘డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం క్లైమాక్స్‌ను అస‌లు మిస్ చేసుకోకండి’ అని ట్వీట్ చేశారు చైత‌న్య‌.

హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ స‌మ‌ర్ప‌ణ‌లో ఆస‌క్తి క‌రంగా ఉండే డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, ఎగ్జ‌యిటింగ్ క్లైమాక్స్‌తో రూపొందిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అద్భుత‌మైన విజువ‌ల్స్‌, టాలెంటెడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను చివ‌రి నిమిషం వ‌ర‌కు ఎంగేజ్ చేస్తుంది.

న‌టీన‌టులు: అన‌సూయ భ‌రద్వాజ్‌, విరాజ్ అశ్విన్‌, అర్చ‌నా అనంత్‌, అనీష్ కురువిల్లా, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, మోనికా రెడ్డి, హ‌ర్ష చెముడు త‌దిత‌రులు

More News

మాజీ మంత్రి మోత్కుపల్లికి కరోనా.. పరిస్థితి విషమం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది.

‘కరోనా టీకాతోనే నటుడు వివేక్ మృతి’

కరోనా టీకా కారణంగానే ప్రముఖ నటుడు వివేక్ మ‌ృతి చెందారని తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ స్పష్టం చేశారు.

సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన నటుడు నరేష్

ప్రముఖ సినీ నటుడు సీనియర్ నరేష్.. స్టోన్ ఇన్‌ఫ్రా కంపెనీ యజమానిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

B.కాంలో ఫీజిక్స్" ట్రైలర్ ను విడుదల చేసిన  ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి

రెడ్ కార్పెట్ రీల్ ప్రొడక్షన్ పతాకంపై అంకిత, అవంతిక, మేఘన,నగరం సునీల్,జబర్దష్ అప్పారావు నటీ నటులుగా సామ్ జె చైతన్య స్వీయ దర్శకత్వంలో

మళ్లీ లాక్‌డౌన్ భయం.. ఇంటి బాట పడుతున్న వలస కూలీలు

మాయదారి కరోనా రెట్టింపు వేగంతో విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది లక్ష కేసులంటేనే జనం భయపడ్డారు.