close
Choose your channels

'అనసూయ' కి 10 ఏళ్లు

Thursday, December 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో రాణించిన క‌థానాయిక‌ల్లో భూమికా చావ్లా ఒక‌రు. `మిస్స‌మ్మ‌`లో త‌న న‌ట‌న‌తో అల‌రించ‌డ‌మే కాకుండా.. నంది పుర‌స్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు భూమిక‌. `మిస్స‌మ్మ` త‌రువాత మ‌ళ్లీ విమెన్ సెంట్రిక్ మూవీలో భూమిక మెప్పించిన చిత్రం `అన‌సూయ‌`. వ‌రుస హ‌త్యల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో.. జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో భూమిక న‌ట‌న ఆక‌ట్టుకునేలా ఉంటుంది.
ఇక ద‌ర్శ‌కుడు ర‌విబాబు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన విధానం.. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌థ‌మార్థం అంతా హ‌త్య‌ల నేప‌థ్యంలో సాగితే.. ద్వితీయార్థం ఆ హ‌త్య‌ల తాలుకూ ప‌రిశోధ‌న‌, ఫ్లాష్ బ్యాక్ నేప‌థ్యంలో ఉంటుంది. కమ‌ర్షియ‌ల్‌గా మంచి స‌క్సెస్ అయిన ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర అందించిన నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అబ్బాస్‌, ర‌విబాబు, నిఖిత‌, అంకిత త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి సుధాక‌ర్ రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం అందించారు. డిసెంబ‌ర్ 21, 2007న విడుద‌లైన `అన‌సూయ‌`.. నేటితో 10 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.