చిరు 152లో రంగమ్మత్త ?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య ఇప్పుడు సెట్స్‌లో ఉంది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఇప్పటికే రెజీనా కసండ్ర ఓ స్పెషల్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ మరో స్పెషల్ సాంగ్‌లో నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. మరి సోషల్ మీడియాలో వినపడుతున్న వార్తలపై అటు మెగాక్యాంప్.. ఇటు అనసూయ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
బుల్లితెర హాట్ యాంగకర్గా పేరు తెచ్చుకున్న అనసూయ క్షణం సినిమాతో నటిగా మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత సోగ్గాడే చిన్నినాయనా, కథనం వంటి పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు చిరు 152లో అనసూయ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఇవి నిజమైతే.. గతంలో మేనల్లుడు సాయితేజ్ విన్నర్ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడిన అనసూయ.. మావయ్య మెగాస్టార్‌తోనే ఆడిపాడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.