close
Choose your channels

రంగమ్మ పాత్రలో అనసూయ?

Tuesday, February 20, 2018 • తెలుగు Comments

లవ్ స్టోరీలను డీల్ చేయడంలో ద‌ర్శ‌కుడు సుకుమార్ సిద్ధ‌హ‌స్తులు. "వన్ సైడ్ లవ్" అంటూ ఆర్య` సినిమాలో.. ప్రేమకే ఒక కొత్త నిర్వచనం చెప్పారు ఈ బ్రిలియంట్ దర్శకుడు. అలాగే '100% ల‌వ్‌'లోనూ ప్రేమ‌లోని కొత్త కోణాన్ని చూపారు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ రామ్ చరణ్, సమంతతో 'రంగ‌స్థ‌లం' తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది కూడా విభిన్న‌మైన‌ ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కుతోంద‌ని.. ఇటీవ‌ల విడుద‌లైన‌ “ఎంత సక్కగున్నావే లచిమి” పాటతో అర్ధమవుతోంది. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలే సినిమాకి ప్రధాన ఆకర్షణ అని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. త్వరలో “రంగమ్మ, మంగమ్మ” అంటూ సాగే ఓ పాటను విడుద‌ల చేయ‌బోతోంది చిత్ర బృందం. అందులో వ‌చ్చే “రంగమ్మ” పాత్ర‌లో క‌నిపిస్తున్న‌ది మ‌రెవ‌రో కాదు.. బుల్లి తెర హాట్ యాంకర్ అనసూయ. ఈ పాట‌లో అన‌సూయ నృత్యాలు యువ‌త‌రాన్ని అల‌రించేలా ఉంటాయ‌ని స‌మాచారం. మార్చి 30న 'రంగ‌స్థ‌లం' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz