‘ఖిలాడి’లో అన‌సూయ‌..!

  • IndiaGlitz, [Wednesday,February 03 2021]

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్‌గానే ‘క్రాక్‌’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ర‌వితేజ‌.. ఇప్పుడు ‘ఖిలాడి’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రాన్ని జయంతి లాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ ఉన్ని ముకుంద‌న్ కూడా న‌టిస్తున్నాడు. కాగా తాజాగా ఈ యూనిట్‌తో హాట్ యాంక‌ర్ అన‌సూయ కూడా జాయిన్ అయ్యింది. ఈమె ఓ స్పెష‌ల్ పాత్ర‌లో మెప్పించ‌డానికి స‌న్న‌ద్ధ‌మైంద‌ట‌. మూడు వారాలుగా ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 28న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. గతంలో రవితేజతో వీర సినిమాను డైరెక్ట్ చేసిన రమేశ్ వర్మ అనుకున్న సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. మరి ఈసారైనా రవితేజతో హిట్ కొడతాడో లేదో చూడాలి.

More News

ఆ వార్త మనోవేదనకు గురి చేసింది: డైరెక్టర్ ఎస్.శంకర్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన చిత్రం ‘యందిరన్‌’ (రోబో) కథ విషయంలో స్టార్‌ డైరెక్టర్ ఎస్‌. శంకర్‌పై ఒక అసత్య ప్రచారం జరిగింది.

200 మందితో ఆలియా భట్ భారీ సాంగ్‌

ఆలియా భ‌ట్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గంగూభాయ్ క‌తియావాడి’. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత సంజ‌య్ లీలా భ‌న్సాలి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

30 ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా ఎన్నో స్టంట్లు.. ఆ వ్యక్తి ఎవరంటే..

వెండితెరపై అభిమాన హీరోను చూడగానే అభిమానులు పొంగిపోతారు. ఆ హీరో ఏదైనా స్టంట్ చేస్తే ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

మద్యం, స్మోకింగ్ విమర్శలపై స్పందించిన నమిత

తమిళ చిత్ర పరిశ్రమకు శృంగార తారగా పరిచయమైన హీరోయిన్లలో నమిత ఒకరు. ఇటీవలి కాలంలో ఆమె తరచూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు.

13న దీపికతో సుమంత్ అశ్విన్ వివాహం: ఎంఎస్ రాజు

‘తునీగ తునీగ’, ‘కేరింత’ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన లవర్ బోయ్ సుమంత్ అశ్విన్ పెళ్లికొడుకు కాబోతున్నాడు.