close
Choose your channels

అగస్ట్ 9 న అనసూయ 'కథనం'

Tuesday, July 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కథనం'.. ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, పతాకాలపై బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం సమకూరుస్తుండగా, స‌తీష్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదలకు సిద్దమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత న‌రేంద్ర రెడ్డి మాట్లాడుతూ... అన‌సూయ‌గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన చిత్రమిది. ఆవిడ కెరీర్ లొ ఇదొక బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది.సెన్సార్ పూర్తయింది.యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు లభించాయి. ఆగస్ట్ 9 న సినిమా విడుదల చెస్తామన్నారు.

దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ... ఇది నా మొద‌టి చిత్రం.. క్ష‌ణం, రంగ‌స్థ‌లం తర్వాత ఆమె చేస్తున్న ఈ క‌థ‌నం సినిమా తో హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నారు అన‌సూయ‌గారు. తప్పకుండ ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది.. న‌రేంద్ర‌రెడ్డిగారు పంపిణిదారునిగా ఏ సినిమా చేసిన హిట్.. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారన్న నమ్మకం ఉందన్నారు.

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బాలాజీ శ్రీ‌ను, ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ద‌వ్‌, మ్యూజిక్ః రోషన్ సాలూరి , ఆర్ట్ డైరెక్ట‌ర్ః కె.వి.ర‌మ‌ణ‌, రచయిత : రాజేంద్ర భరద్వాజ్, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీః స‌తీష్ ముత్యాల‌, లైన్ ప్రొడ్యుసర్ : ఎమ్‌.విజ‌య చౌద‌రి, నిర్మాత‌లుః బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా, క‌థ‌, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వంఃరాజేష్ నాదెండ్ల‌

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.