close
Choose your channels

విల‌న్ పాత్ర‌లో అన‌సూయ‌..?

Tuesday, February 18, 2020 • తెలుగు Comments

విల‌న్ పాత్ర‌లో అన‌సూయ‌..?

బుల్లితెర‌పై జ‌బ‌ర్‌ద‌స్త్ వంటి ప్రోగ్రామ్‌తో క్రేజ్ సంపాదించుకున్న అన‌సూయ భ‌రద్వాజ్‌. త‌ర్వాత క్ష‌ణం సినిమాతో వెండితెర పైకి కూడా రంగ ప్ర‌వేశం చేసింది. ఆ సినిమా హిట్ కావ‌డంతో క‌థ‌నం, విన్న‌ర్‌లో స్పెష‌ల్ సాంగ్‌, సోగ్గాడే చిన్ని నాయనా వంటి ప‌లు చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈమె న‌టించిన రంగ‌స్థ‌లంలో రంగ‌మ‌త్త‌గా న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందింది. అన‌సూయ న‌ట‌న న‌చ్చిన డైరెక్ట‌ర్ సుకుమార్ త‌ను అల్లు అర్జున్‌తో చేయ‌బోయే చిత్రంలో కీల‌క పాత్ర‌కు ఎంపిక చేసుకున్నార‌ట‌. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో అన‌సూయ ప్ర‌తి నాయ‌కురాలిగా క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మ‌రి.

అయితే అన‌సూయ‌కు విల‌న్‌గా న‌టించ‌డం ఇదే తొలిసారేమీ కాదు.. క్ష‌ణం సినిమాలోనూ అన‌సూయ ప్ర‌తినాయ‌కిగానే న‌టించి ఆక‌ట్టుకుంది. సుకుమార్ అన‌సూయ‌ను దృష్టిలో పెట్టుకునే ఈ పాత్ర‌ను క్రియేట్ చేశాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇది కాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మిస్తోన్న చిత్రంలోనూ అన‌సూయ న‌టిస్తుంది. అలాగే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, క్రిష్ సినిమాలోనూ కీల‌క పాత్ర‌లో అన‌సూయ క‌న‌ప‌డ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

Get Breaking News Alerts From IndiaGlitz