close
Choose your channels

నాపై ఇంత నీచంగానా.. హీరోలు బట్టలు విప్పి, రొమాన్స్ చేస్తే మాట్లాడరే : కోటాకు అనసూయ ఘాటు రిప్లయ్

Tuesday, October 19, 2021 • తెలుగు Comments

నాపై ఇంత నీచంగానా.. హీరోలు బట్టలు విప్పి, రొమాన్స్ చేస్తే మాట్లాడరే : కోటాకు అనసూయ ఘాటు రిప్లయ్

నటీనటుల మధ్య ఆహ్లాదకరంగా.. ఎంతో ఫ్రెండ్లీగా వుండే వాతావరణం కాస్తా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చిచ్చుపెట్టాయి. ఇండస్ట్రీని రెండు వర్గాలుగా చిల్చీన ఈ పోరు తర్వాత ఎప్పటి నుంచో మిత్రులుగా వుంటున్న వారు కూడా శత్రువులుగా మారిపోయారు. ఇక ఎన్నికల సమయంలో రెండు వర్గాలకు సపోర్ట్ చేస్తూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీరిలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కూడా ఒకరు. ప్రకాశ్ రాజ్ టైమ్‌కి రాడని.. పరిశ్రమలో అందరికీ అతని గురించి తెలుసునని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే పరభాషా నటీనటులపై కామెంట్స్ చేసిన చరిత్ర కోటాకి వుంది. ఇక తాజా మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ నుంచి పోటీ చేసిన స్టార్ యాంకర్ అనసూయపై కోటా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆవిడ చక్కని న‌టి అని, హావ‌భావాలు అద్భుతంగా ప‌లికించడంతో పాటు, డాన్సులు బాగా చేస్తార‌ని ప్రశంసించిన కోటా.. అనసూయ వేసుకునే డ్రెస్సులు త‌న‌కు న‌చ్చ‌వ‌ని వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలపై అన‌సూయ ఘాటుగా బదులిచ్చారు. కోటా పేరుని ఎక్కడా ప్ర‌స్తావించ‌కుండా పరోక్షంగా ట్విట్ట‌ర్ ద్వారా విమ‌ర్శించారు. ‘‘రీసెంట్‌గా ఓ సీనియ‌ర్ యాక్ట‌ర్ నాపై కొన్ని కామెంట్స్ చేశార‌ని తెలిసింది. ఆయ‌న తన వ‌స్త్ర‌ధార‌ణ గురించి మాట్లాడారు. అంతటి అనుభ‌వ‌మున్న వ్య‌క్తి అలా నీచంగా మాట్లాడ‌టం అనేది తనకు చాలా దు:ఖాన్ని క‌లిగించింది. ఎవరు ధ‌రించే దుస్తులు వారి వ్య‌క్తిగ‌తం, అంతేకాదు.. వృత్తినిబట్టి, ప‌రిస్థితుల‌ను బట్టి అవసరమైతేనే అలా చేస్తారు. అది వారి స్వ‌విష‌యం. కానీ సోష‌ల్ మీడియా అలాంటి వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తుంది. అలాంటి సీనియ‌ర్ న‌టుడు మందు తాగుతూ, అధ్వాన‌మైన దుస్తుల‌ను ధ‌రించి ఎలా పేరు తెచ్చుకున్నాడో అర్థం కాలేదు. ఆయ‌న వెండితెర‌పై స్త్రీల‌ను కించ‌ప‌రిచిన స‌న్నివేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ అలాంటి వార్త‌ల‌ను సోష‌ల్ మీడియా ఎందుకు ప‌ట్టించుకోలేదో నాకే ఆశ్చర్యం కలిగిస్తూ వుంటుంది.

ఇలాంటి వారిని ఎవ‌రూ ఎందుకు ప్ర‌శ్నించ‌రు? ఎవ‌రైతే పెళ్లి చేసుకున్నారో, పిల్ల‌ల‌ను క‌లిగి ఉన్నారో, సిల్వ‌ర్ స్క్రీన్‌పై న‌టీమ‌ణుల‌తో రొమాన్స్ చేస్తున్నారో, ష‌ర్టులు వేసుకోండా త‌మ శరీరాన్ని చూపించే వారినెందుకు ప్ర‌శ్నించ‌రు. తానొక పెళ్లైన మ‌హిళ‌నని.. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిని.. నా వృత్తిలో గెలవటానికి ఎంతో శ్రమిస్తున్నాను. అది నచ్చకపోతే.. నేనేమి చేయలేను. దయచేసి మీ పని మీరు చూసుకోండి. అనవసరంగా ఇతరులపై మీ అభిప్రాయాలను చెప్పడం మానుకోండి’’ అంటూ ట్వీట్ చేసింది అనసూయ. మరి ఆమె ట్వీట్‌పై కోటా శ్రీనివాసరావు స్పందిస్తారో.. లేక వివాదం ఇక్కడితో ఫుల్‌స్టాప్ పడుతుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz