రిపబ్లిక్ డే : వివాదంలో అనసూయ.. 'అరే ఏందిరా బై మీ లొల్లి..' అంటూ రెచ్చిపోయిన రంగమ్మత్త

  • IndiaGlitz, [Thursday,January 27 2022]

స్టార్ యాంకర్, సినీ నటి అనసూయ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఇందుకు కారణం ఏంటీ..? ఆమె ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందో ఒకసారి చూస్తే.. ఈవెంట్లు, సినిమాలు, షూటింగ్‌లతో బిజీగా వున్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో అనసూయ యాక్టీవ్‌గా వుంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన వివరాలను ఆమె అభిమానులతో పంచుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని బుధవారం ఉదయం దేశప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘వందేమాతరం’ ఆలపిస్తూ ఓ వీడియోను షేర్‌ చేసి.. రిపబ్లిక్‌ డే విషెస్‌ చెప్పారు అనసూయ.

ఆ వీడియో చూసిన నెటిజన్లు భగ్గుమన్నారు. వందేమాతరం పాడేటప్పుడు ఎందుకు నిల్చోలేదంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు టీ షర్ట్‌ పై గాందీ బొమ్మ ఎందుకు ధరించారంటూ మండిపడుతున్నారు. ఇలా చెప్పినందుకు మీరు ఫీలై ఉంటే క్షమించండి’’ అని నెటిజన్ల నుంచి వరుసగా కామెంట్లు వచ్చాయి.

ఆ కామెంట్లపై స్పందించిన అనసూయ..మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిల్చొని వందేమాతరం ఆలపించనందుకు చాలామంది అసహనానికి లోనైనట్లు ఉన్నారు. అందుకు నన్ను క్షమించండి అంటూ పోస్ట్ చేశారు. జాతీయ గీతమైన ‘జనగణమన’కు లేచి నిలబడతాం.. తద్వారా దేశంపట్ల మన గౌరవాన్ని చాటుతాం. కానీ, నేను పాడింది జాతీయ గేయమైన వందేమాతరం.. అన్న సంగతిని మీరందరూ గమనించాలి. నా దేశం పట్ల నాకెంతో గౌరవం ఉంది’’ అని అనసూయ బదులిచ్చారు.

ఈ వివరణకు సంతృప్తి చెందని కొందరు నెటిజన్లు అదే పనిగా ట్రోలింగ్ చేస్తుండటంతో అనసూయ అసహనానికి గురయ్యారు. ‘‘అరేయ్‌ ఎందిరా భయ్‌ మీ లొల్లి.. జాతీయ గేయం అంటారు.. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటి? అంటారు.. వందేమాతరాన్ని జాతీయ గీతం అనుకుంటే మరి జనగణమన ఏంది? ఆగస్టు 15, 1947 స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టే.. జనవరి 26, 1950లో గణతంత్ర దినోత్సవం వచ్చింది. అందుచేత కాస్త బుర్ర అద్దెకు తెచ్చుకుని మాట్లాడండి’’ అని రంగమ్మత్త ఘాటుగా బదులిచ్చారు.

More News

‘సుందరాంగుడు’ చిత్రం విడుదలకు సహకరించండి - హీరో కృష్ణసాయి

ఏ.వి.సుబ్బారావు సమర్పణలో ఎమ్‌.ఎస్‌.కె. ప్రమీద శ్రీ ఫిలిమ్స్‌ పతాకంపై కృష్ణసాయి,

‘‘ఫుల్ కిక్కు’’ అంటోన్న ఖిలాడీ.. రవితేజ ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్‌గా నటిస్తోన్న సినిమా 'ఖిలాడి'.

‘‘విరాట్’’ సేవలకు ఇక విశ్రాంతి.. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ వీడ్కోలు

73వ గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ ‘విరాట్‌’కు వీడ్కోలు పలికారు.

ఉదయం చిరంజీవి.. ఇప్పుడు శ్రీకాంత్‌, తెలుగు ఇండస్ట్రీపై కోవిడ్ పడగ

తెలుగు చిత్ర పరిశ్రమపై కోవిడ్ పగబట్టినట్లుగా  వుంది. ఇప్పటికే మహేశ్ బాబు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు,

టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించిన కేసీఆర్.. ఏ జిల్లాకు ఎవరంటే..?

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఏకకాలంలో పార్టీ అధ్యక్షులను నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.