Rashmi Gautam : స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ పోస్ట్

  • IndiaGlitz, [Saturday,January 21 2023]

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ (Anchor Rashmi Gautam)ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా కన్నుమూశారు. ఈ మేరకు రష్మీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మతో వున్న అనుబంధాన్ని ఆమె పంచుకున్నారు. ఆమె ఎంతో స్ట్రాంగ్ అని.. మా కుటుంబంపై ఆమె ప్రభావం ఎంతో వుందని, ఆమె దూరమైనా తన జ్ఞాపకాలు మాత్రం మాతోనే వుంటాయని రష్మీ రాసుకొచ్చారు.

జబర్దస్త్‌‌తో స్టార్ డమ్:

ఇక... తెలుగు టెలివిజన్ తెరపై వున్న స్టార్ యాంకర్లలో రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఒకరు. ఈటీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ రష్మీ తెలుగు లోగిళ్లకు దగ్గరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన పాపులారిటీతోనే టీవీ షోలు, ఈవెంట్స్, ఓపెనింగ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ వాటి ద్వారా రష్మీ ఇప్పుడు ఫుల్ బిజీ. అప్పుడప్పుడు వెండితెరపైనా మెరుస్తూ.. తనకొచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఖాళీ దొరికితే సన్నిహితులు, మిత్రులతో కలిసి ఏదైనా వెకేషన్‌కి వెళ్లడం రష్మీకి అలవాటు.

వెండితెర, బుల్లితెరపై రాణిస్తోన్న రష్మీ :

రష్మీ గౌతమ్ విశాఖలో జన్మించారు.ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. తెలుగు, హిందీ, ఒడియా, ఇంగ్లీష్ భాషల్లో రష్మీ అనర్గళంగా మాట్లాడగలదు. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఆమె సినీ ఇండస్ట్రీలో వుంటున్నారు. జబర్దస్త్‌తో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ఈ అమ్మడు.. గుంటూరు టాకీస్, అంతం, నెక్ట్స్ నువ్వే, అంతకుమించి, ప్రస్థానం వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.

More News

Chaganti Koteswara Rao : చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీలో కీలక పదవి..

ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కీలకపదవి దక్కింది.

Allu Arjun: విశాఖలో పుష్ప 2 షూటింగ్.. ఎయిర్‌పోర్ట్‌లో బన్నీకి ఘనస్వాగతం, లాంగ్ హెయిర్‌తో స్టైలిష్‌ లుక్‌లో ఐకాన్‌స్టార్

బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో

Brahmaji:మెగా ఫ్యామిలీపై కామెంట్స్‌.. చిన్న ఆర్టిస్టులే కదా భయపడతారెందుకు: రోజాకు బ్రహ్మాజీ కౌంటర్

వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలినీ టార్గెట్ చేయడం కలకలం రేపింది.

Vande Bharat Express : త్వరలో బెర్త్‌లు వుండే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. స్పీడ్ గంటకు 200 కి.మీ, ప్రత్యేకతలివే

దేశంలోని ప్రధాన నగరాలకు వేగంగా చేరుకోవడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్

C Kalyan: ఆర్గనైజేషన్‌ కి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా ఊరుకోము - సి. కళ్యాణ్‌

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు సి. కళ్యాణ్‌ బుధవారంనాడు