పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి.. వాళ్లపై కంప్లయింట్

  • IndiaGlitz, [Tuesday,December 14 2021]

యాంకర్‌గా బుల్లితెరపై ఆకట్టుకోవడంతో పాటు ఫంక్షన్లకు హోస్ట్‌గా జనంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నాడు. అయితే వెండి తెరపై ఆశించిన గుర్తింపు రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో తనకున్న పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్‌గా ఆఫర్ అందుకున్నాడు. టైటిల్ విజేతల్లో ఒకరిగా ప్రచారం జరిగినప్పటికీ.. అనుకోని పరిస్ధితుల్లో హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు షాకయ్యారు. ఇదిలా ఉంటే రవి తాజాగా పోలీసులను అశ్రయించినట్టుగా తెలుస్తుంది. తనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన పైనే కాకుండా తన కుటుంబ సభ్యులపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని రవి చెప్పారు. తనపై ఎన్ని రకాల కామెంట్స్ చేసినా పట్టించుకోని రవి.. తన కుటుంబసభ్యుల గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేయడం‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి చేసిన ప్రతి బ్యాడ్ కామెంట్‌కు సమాధానం చెప్పాల్సిందే అని రవి అంటున్నారు. ఇక బిగ్‌బాస్ కారణంగా దాదాపు రెండు నెలల పాటు కుటుంబానికి దూరంగా వున్న రవి.. తర్వాత హాలిడే ట్రిప్‌కి వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఆయన బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న టాప్‌ 5లో శ్రీరామ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. అయితే ఓటింగ్ సరళి చూస్తే మాత్రం ఇప్పుడు అందరికంటే ముందంజలో సన్నీ వుండగా.. ఆ తరువాత షన్ను రెండో స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రైవేట్ పోల్స్, సర్వేలు, సోషల్ మీడియాలోని చర్చను చూస్తుంటే గ్రాండ్ ఫినాలే పోటాపోటీగా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది.

More News

'భగవద్గీతా ఫౌండేషన్' నిర్వహణలో 'గీతాజయంతి మహోత్సవం' వేడుక

ధర్మాన్ని పాటిస్తే సమాజ శాంతి ఎవరి వృత్తి పనిలో వారు ధర్మబద్ధంగా ఉంటే సమాజం లో శాంతి నెలకొంటుందని సీబీఐ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ వీ.వీ  లక్ష్మీ నారాయణ అన్నారు.

టాలీవుడ్‌కు ఊరట.. జగన్ సర్కార్‌కు షాక్, సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

సినిమా టికెట్‌ ధరల విషయంలో ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.

రానా పుట్టినరోజు సందర్భంగా 'భీమ్లా నాయక్' నుంచి  డేనియల్ శేఖర్ మరో ప్రచార చిత్రం విడుదల

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం  'భీమ్లా నాయక్'.

‘బంగార్రాజు’ స్పెషల్ సాంగ్‌లో ఫరియా అబ్దుల్లా

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ

తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.