గోవాలో వాళ్లిద్దరూ...

  • IndiaGlitz, [Saturday,February 06 2021]

అవును... వాళ్లిద్దరూ గోవాలో ఉన్నారు! ఎవరు? అనుకుంటున్నారా!? బుల్లితెర బ్యూటీలు శ్రీముఖి, విష్ణుప్రియ. మరికొంతమంది స్నేహితులతో కలిసి వీళ్లిద్దరూ గోవా వెళ్లారు. బీచ్‌ సైడ్‌ రిసార్టుల్లో సేద తీరుతున్నారు. అంతేనా? పాటలు పాడుతున్నారు. రాళ్లల్లో, ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు అన్నట్టు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. గోవా బీచ్‌లో శ్రీముఖి దిగిన ఫొటోలు అయితే నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయు. వైట్‌ టీషర్టు, బ్లాక్‌ షార్టులో బుల్లితెర రాములమ్మ నెటిజన్లకు షాక్‌ ఇచ్చింది. అలాగే, ఆమె మంచి ఫుడ్‌ లవర్‌ అనే సంగతి తెలిసిందే. బీచ్‌లో ఫుడ్‌ తింటున్న ఫొటోలనూ షేర్‌ చేసింది. శ్రీముఖి, విష్ణుప్రియతో రేడియో జాకీ చైతూ, మరికొంతమంది స్నేహితులు ఈ ట్రిప్‌లో ఉన్నారని తెలుస్తోంది. గతంలో ‘బిగ్‌ బాస్‌’లోకి వెళ్లొచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌తో మాల్దీవ్స్‌కి వెళ్లొచ్చింది శ్రీముఖి. అదండీ సంగతి!