close
Choose your channels

Udaya Bhanu : గాజు గ్లాస్‌లో టీ తాగుతూ.. పవర్‌స్టార్ పంచ్ డైలాగ్, వైరలవుతోన్న ఉదయభాను పోస్ట్

Tuesday, January 24, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉదయభాను (Anchor Udaya Bhanu)ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఇప్పుడంటే కొత్తవారు వచ్చేశారు గానీ ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై ఉదయభాను రాణిగా వెలుగొందారు. సుమ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి వంటి వారు తనకు పోటీగా వున్నప్పటికీ.. తన అందం, పంచ్‌లు, మాడ్యులేషన్‌తో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుని ఆశ్చర్యపరిచారు.

15 ఏళ్ల వయసులోనే యాంకర్‌గా ఎంట్రీ :

15 ఏళ్ల వయసులోనే యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను (Udaya Bhanu)తొలుత హృదయాంజలి ప్రోగ్రామ్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమం ఇచ్చిన జోష్‌తో వరుసగా వన్స్‌మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింభకా, జానవులే నెరజాణవులే, నీ ఇల్లు బంగారం కాను వంటి షోలతో బిజీ అయ్యారు. బుల్లితెరతో పాటు శ్రావణ మాసం, ఎర్రసైన్యం, లీడర్, కొండవీటి సింహం వంటి సినిమాల్లోనూ నటించారు. దీనికి తోడు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, వాణిజ్య ప్రకటనలతో ఉదయభాను స్టార్‌డమ్‌ను అనుభవించారు. కెరీర్ పీక్స్‌లో వున్న దశలో ఆమె అన్నింటిని వదిలిపెట్టి.. పెళ్లి చేసుకుని ఇద్దరు కవలలకు తల్లయ్యారు.

పవన్ కోసమే ఉదయభాను పోస్ట్ పెట్టారా :

సెకండ్ ఇన్సింగ్స్‌లో అడపాదడపా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో సందడి చేస్తున్నారు ఉదయభాను. అలాగే సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టీవ్‌గా వుంటున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. టీ తాగుతున్న వీడియో అది. ఇందులో ప్రత్యేకత ఏముందని మీరు అనుకోవచ్చు. గాజు గ్లాసులో టీ తాగుతూ.. ‘‘ఈ గ్లాసులో చాయ్ తాగితే ఈ కిక్కే వేరబ్బ’’ అని పవర్‌స్టార్ పంచ్ డైలాగ్ చెప్పింది. దీని బ్యాక్‌గ్రౌండ్‌లో భీమ్లా నాయక్ సాంగ్ వినిపిస్తూ వీడియో పోస్ట్ చేసింది ఉదయభాను. అలాగే తన పోస్ట్‌కు #PowerStar అనే హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది.దీనిని చూసిన వారు ఆమె ఈ పోస్ట్ పెట్టింది పవన్ కల్యాణ్ కోసమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే గాజు గ్లాస్ అనేది పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ ఎన్నికల గుర్తు కాబట్టి. మరి ఆమె పవన్ కోసం ఈ పోస్ట్ పెట్టారా లేదంటే మరేదైనా కారణం వుందా అనేది తెలియాల్సి వుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.