హ్యుజ్ రెస్పాన్స్ రాబట్టుకున్న రాజ్ తరుణ్ 'అంధగాడు' టీజర్

  • IndiaGlitz, [Wednesday,April 26 2017]

ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'అంధ‌గాడు'. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు 'అంధ‌గాడు' అల్రెడి విడుద‌లైన పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. తొలిసారి రాజ్‌త‌రుణ్ గుడ్డివాడి పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. నిన్న‌ విడుద‌లైన టీజ‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

కంప్లీట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కామెడి, ల‌వ్‌, యాక్ష‌న్‌, సస్పెన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ స‌మ‌పాళ్ళ‌లో ఉండేలా ద‌ర్శ‌కుడు వెలిగొండ శ్రీనివాస్ డిఫ‌రెంట్ స్క్రిప్ట్‌తో తెర‌కెక్కించారు. స్ట్రాంగ్ అండ్ ఎగ్జ‌యిట్‌మెంట్ పాయింట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుంది. మే 26న సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

More News

రికార్డు ధరకు ఎన్టీఆర్ మూవీ శాటిలైట్ హక్కులు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా

మహేష్ మూవీ క్లైమాక్స్ కు ముహుర్తం కుదిరింది..

సూపర్ స్టార్ మహేష్,స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగ దాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ 'స్పైడర్'.

గాయత్రి ప్రొడక్షన్స్ శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ గ్రాండ్ లాంచ్

ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్ చేతుల మీదుగా గాయత్రి ప్రొడక్షన్స్ శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట ఫస్ట్ లుక్ లాంచ్ మోషన్ పోస్టర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుదనం వచ్చింది: మెగాస్టార్ చిరంజీవి

కళాతపస్వీ కె.విశ్వనాథ్ కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మే 5 నుండి జగపతిబాబు 'సూర్యాభాయ్ ' చివరి షెడ్యూల్ షూటింగ్

ప్రైమ్ స్టార్ జగపతిబాబు హీరోగా చిన్నారి ఆర్ట్స్,శ్రీ తిరుమల సినిమాస్ పతాకాలపై అర్జున్ వాసుదేవ్ దర్శకత్వంలో