'అందమైన జీవితం' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Monday,August 14 2017]

మేఘవర్ష క్రియేషన్స్ పతాకంపై, మలయాళం లో సంచలన విజయం సాధించిన 'జొమోంటే సువిశేషంగాళ్' చిత్రాన్ని అందమైన జీవితం పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు అభిరుచి గల నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు. సత్యన్ అంతిక్కాడ్ ఈ చిత్రానికి దర్శకుడు. దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా వుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'ఇదొక లవ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని, ప్రేమికుల మధ్య వుండే ప్రేమని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమే అందమైన జీవితం. సంగీతానికి మంచి ఇంపార్టెన్స్ వున్న మ్యూజికల్ హిట్ చిత్రమిది. మలయాళం లో ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లో నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ఈ నెలాఖరున సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం..అని అన్నారు.

దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, మాటలు: ఘంటసాల రత్నకుమార్, ఎడిటింగ్: ఈ. ఎమ్. నాగేశ్వరరావు, ఫోటోగ్రఫీ: ఎస్. కుమార్, పాటలు: శ్రీరామమూర్తి, నిర్మాత: పత్తిపాటి శ్రీనివాసరావు, దర్శకత్వం: సత్యన్ అంతిక్కాడ్.

More News

'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' మోషన్ పోస్టర్!!

'చంద్రకాంత్-రాధికా మెహరోత్రా' లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ..'థర్డ్ ఐ క్రియేషన్స్' పతాకంపై..'రఘురాం రొయ్యూరు'తో కలిసి..

అగష్టు18 నుండి 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' షూటింగ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,అను ఇమ్యునల్ హీరోయిన్ గా వక్కంతం వంశి దర్శకత్వం లో

కాజల్ సీన్ రివర్సయ్యింది

ఒకే పనిని రెండుసార్లు చేస్తే.. రెండుసార్లూ ఒకేలా ఫలితం రావాలనేం లేదుగా. ఒకసారి వర్కవుట్ అయితే.. మరోసారి తేడా కొట్టొచ్చు. లేదంటే మొదటిసారి నెగెటివ్ రిజల్ట్ వచ్చి.. రెండోసారి పాజిటివ్ రిజల్ట్ రావచ్చు. ఇదిగో ఈ రెండో వెర్షన్ లోనే ఉంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ పరిస్థితి.

'వివేకం' ఆడియో విడుదల

తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం 'వివేగం'.

అప్పుడు రాజమౌళి.. ఇప్పుడు సుకుమార్ ..

'బాహుబలి' కి ముందు రాజమౌళి కెరీర్లో పెద్ద హిట్ అంటే అది 'మగధీర'సినిమానే.