మే 28న 'అంధగాడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్

  • IndiaGlitz, [Thursday,May 25 2017]

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'అంధ‌గాడు'. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించారు. ఈ సినిమా జూన్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు, సాంగ్స్‌కు సోష‌ల్ మీడియాలో ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా మంచి అంచ‌నాలు నెకల‌కొన్నాయి. హిలేరియ‌స్ ట్రైల‌ర్‌గా యాక్ష‌న్‌, థ్రిల్‌, రొమాన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

సినిమా విడుద‌ల్లో భాగంగా ప్ర‌మోష‌న్స్‌ను ముమ్మరం చేశారు. మే 28న హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇదే వేడుక‌లో గుమ్మ‌డికాయ ఫంక్ష‌న్‌ను కూడా కండెక్ట్ చేస్తారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్‌లో భాగ‌మై సినిమా కోసం వ‌ర్క్ చేసిన టెక్నిషియ‌న్స్‌ను చిత్ర నిర్మాత‌లు స‌న్మానిస్తారు.

ఇప్ప‌టికే రెండు సూప‌ర్‌హిట్ చిత్రాల్లో జ‌త క‌ట్టిన రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్ జోడికి, రాజ్‌త‌రుణ్, ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌కు హ్యాట్రిక్ హిట్ ఖాయ‌మ‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి.

రాజ్‌త‌రుణ్‌తో పాటు స‌త్య‌, సుద‌ర్శ‌న్‌లు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నారు. కామెడి, థ్రిల్లింగ్‌, స‌స్పెన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్, శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌పీ సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంది.

రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రికిపాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.

More News

రజనీకాంత్ 'కాలా'

సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మే 28న సినిమా స్టార్ట్ కానుంది. కబాలి తర్వాత పారంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ధనుష్ తన స్వంత బ్యానర్ వండర్ బార్స్పై నిర్మిస్తున్నాడు.

పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న 'సత్యా గ్యాంగ్'

'మన కోసం మనం బ్రతకడం కాదు.. పదిమంది కోసం బ్రతకాలి' అనే నినాదానికి పుష్కలమైన వినోదం జోడించి రూపొందుతున్న

'మామ్' చిత్రం కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్ చెబుతున్న శ్రీదేవి

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ఐ పిక్చర్స్ పతాకాలపై 'మామ్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

'వైశాఖం' థీమ్ టీజర్ కి 1.3 మిలియన్ వ్యూస్

డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అయ్యాయి. వాటన్నింటినీ మించి లేటెస్ట్గా జయ బి. దర్శకత్వంలో రూపొందిన 'వైశాఖం' ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సూపర్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేసిన 'వైశాఖం' థీమ్ టీజర్కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

నిర్మాతకు జీవిత ఖైదు...

సమరసింహారెడ్డి, నరసింహుడు చిత్రాల నిర్మాత చెంగల వెంకట్రావుకు అనకాపల్లి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విదించింది. పదేళ్ళ క్రితం నక్కపల్లి మండలంలో బంగారమ్మ పేటలో బి.ఎం.సి కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన గొడవల్లో గోసల కొండ అనే మత్య్సకారుడు చనిపోయాడు.