కోవిడ్‌పై సమరానికి సిద్ధమైన ఏపీ.. జగన్ కీలక ఆదేశాలు..

కోవిడ్‌పై సమరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నేడు జిల్లా కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా ఇకపై 104 కాల్‌ సెంటర్‌‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కాల్‌ సెంటర్‌ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆ నంబర్‌కు బాధితుల నుంచి ఫోన్‌ వచ్చిన వెంటనే.. వారికి తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఆస్పత్రికి వెళ్లడమా, క్వారంటైన్‌కు పంపడమా, హోం ఐసొలేషనా? ఏం చేయాలన్నది స్పష్టంగా చెప్పాలని జగన్ పేర్కొన్నారు.

కోవిడ్‌కు సంబంధించిన అన్ని సమస్యలకు 104 నంబర్‌ అన్నది వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అని ఆయన తెలిపారు. 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. మందులు ఫ్రీగా ఇవ్వాలని.. 104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. జేసీ (గ్రామ వార్డు సచివాలయాలు, అభివృద్ధి) ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలని సూచించారు. మన అధీనంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జేసీ చూడాలన్నారు. నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషథాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, హెల్ప్‌ డెస్క్‌లు వాటిలో ఆరోగ్యమిత్రలు అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు.

సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అనేది ఎప్పటికప్పుడు చూడాలని జగన్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కోవిడ్‌ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలన్నారు. వాటికి ఇన్‌చార్జ్‌లను నియమించాలన్నారు. జిల్లా స్థాయి ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలని జగన్ తెలిపారు. అందులో ఔషథ నియంత్రణ విభాగం అధికారులు కూడా ఉండాలని పేర్కొన్నారు. అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలన్నారు. ఎక్కడ ఖాళీలున్నా తక్షణమే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయాలని.. ప్రజలు ఒకే చోట చేరకుండా చూడాలన్నారు. ఇకపై పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్‌లు, పార్కుల్లో అందరూ ఒకేచోట చేరకుండా చూడాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.

More News

యాంకర్ శ్యామల భర్తపై చీటింగ్ కేసు

ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేం శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది.

పవర్ స్టార్ ‘ఖుషి’ సినిమాకు 20 ఏళ్లు...

ఎస్.జె.సూర్య దర్వకత్వంలో శ్రీ సూర్య ఫిలింస్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మించిన సినిమా ‘ఖుషి’.

‘ఆచార్య’ విడుదలను వాయిదా

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’.

‘పుష్ప’లో బన్నీకి సోదరిగా ప్రముఖ హీరోయిన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.

మాలాశ్రీ భర్త, ప్రముఖ నిర్మాత కొణిగల్ రాము కరోనాతో మృతి

కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటి మాలా శ్రీ భర్త, నిర్మాత కొణిగల్ రాము(52) కరోనాతో కన్నుమూశారు.