చిన్న సినిమాల‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాయితీలు

  • IndiaGlitz, [Wednesday,August 22 2018]

ఏపీ ఫిలిమ్ డెవ‌ల‌ప్ మెంట్ ఛైర్మ‌న్ అంబికా కృష్ణ సినిమాల నిర్మాణానికి సంబంధించి కొన్ని రాయితీలు ప్ర‌క‌టించారు. నాలుగు కోట్ల లోపు నిర్మించే చిత్రాల‌కు న‌గ‌దు, ప‌న్ను రాయితీల‌తో పాటు.. వాటిని చిన్న సినిమాలుగా గుర్తించి ప‌న్నును వెన‌క్కి ఇచ్చేస్తాం. 18 శాతం జి.ఎస్‌.టిలో 9 శాతం ర‌ద్దు చేసి తిరిగి చెల్లిస్తుంద‌ని తెలిపారు. సినిమాల‌కు ఎఫ్‌.డి.సి ద్వారా సింగిల్ విండో అనుమ‌తులు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటాం.

డ‌బ్బింగ్‌, రీరికార్డింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా ఏపీలోనే పూర్తి చేయాల‌ని అన్నారు. ఉత్త‌మ క‌థాంశం ఉన్న చిత్రాల్లో 15 చిత్రాల‌కు 10 ల‌క్ష‌ల రూపాయల న‌గ‌దును కేటాయిస్తాం. భారీ ఎత్తున రిలీజ్ అయ్యే డబ్బింగ్ సినిమాల వ‌ల్ల తెలుగు సినిమాల‌కు థియేట‌ర్స్ దొర‌క‌డం లేదు. దీనిపై కూడా చ‌ర్య‌లు తీసుకునేలా ప్ర‌ణాళిక‌లు చేస్తున్నామ‌ని తెలిపారు అంబికా కృష్ణ‌.

More News

త‌మిళంలోకి నారా రోహిత్‌

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ వ‌చ్చిన క‌థానాయ‌కుడు నారా రోహిత్‌.. ఆట‌గాళ్ళు చిత్రంతో ఈ శుక్ర‌వారం ప‌ల‌క‌రించబోతున్నాడు.

మ‌హేశ్ తల్లి పాత్ర‌లో...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టిస్తున్న 25 చిత్రం 'మ‌హ‌ర్షి'.

సోనాక్షి కి ఇదే తొలిసారి

ద‌బాంగ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా న‌టిగా తొమ్మిదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది.

రాజ‌మండ్రికి సూర్య‌

ఈ ఏడాది సంక్రాంతికికి గ్యాంగ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సూర్య‌.. ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో

సెప్టెంబర్ 7 న రిలీజ్ కానున్న 'ప్రేమకు రెయిన్ చెక్'

శరత్ మరార్ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణ లో స్టోన్ మీడియా ఫిలిమ్స్ బ్యానర్ 'ప్రేమకు రెయిన్ చెక్'