విడుదలైన ఏంజెల్ తమిళ వెర్షన్ ఆడియో

  • IndiaGlitz, [Thursday,July 13 2017]

శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై నాగాఅన్వేష్, హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం 'ఏంజెల్'. సోషియోఫాంటసీ స్టోరీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు రాజమౌళి శిష్యుడు, నూతన దర్శకుడు బాహుబలి పళని. దాదాపు 40 నిమషాలకి పైగా గ్రాఫిక్స్ హంగులతో రెడీ అవుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోకి విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం ఇది వరకే ప్రకటిచింది. ఈ నేపథ్యంలో తాజాగా జూలై 12న 'ఏంజెల్' తమిళ వెర్షన్ 'విన్నైతాండి వందా ఏంజెల్' ఆడియోను రిలీజ్ చేశారు.
చెన్నైలో తమిళ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖల సమక్షంలో విన్నైతాండి వందా ఏంజెల్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విసి.భుగానాదన్ (డైరెక్టర్), ఆర్వీ ఉదయ్ కుమార్ (డైరెక్టర్), దేవయాని రాజకుమారన్ (డైరెక్టర్), జాక్వార్ థంగమ్(గిల్డ్ ప్రెసిడెంట్), భారతీయ గణేశణ్ (డైరెక్టర్) తో పాటు చిత్ర హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బాపటేల్, నిర్మాతలు సింధూర పువ్వు కృష్ణారెడ్డి, భువన్ సాగర్, దర్శకుడు బాహుబలి పళని పాల్గొన్నారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయని, తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు పళని తెలిపారు. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమాను అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు.

More News

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా దర్శకుడు ఆడియో వేడుక

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్సీఎస్పీ విజయ్కుమార్, థామస్రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

జూలై 14 న ప్రపంచ వ్యాప్తంగా 'డా చక్రవర్తి' విడుదల

శ్రీ వేంకటేశ్వర సూపర్ మూవీస్ బ్యానర్పై 'ఎ ఫిల్మ్ బై అరవింద్' వంటి సెన్సేషనల్ చిత్రాన్ని రూపొందించిన శేఖర్ సూరి దర్శకత్వంలో ఎ. వెంకటేష్ (ఛాంప్), శేఖర్ సూరి, బి. ఆర్. రత్నమాల రెడ్డి నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'డా||చక్రవర్తి'.

బ్రెట్ రాట్నర్ ఆధ్వర్యంలో తెరకెక్కే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న తెలుగు సినిమా హీరో శ్రీ రాజ్

భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ అనే చిత్రంలో హీరోగా నటించిన యంగ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీ రాజ్ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. హాలీవుడ్ స్క్రీన్ పై తన టాలెంట్ చూపించే బంపర్ ఆఫర్ సంపాదించగలిగాడు.

శంకరమహదేవన్ 'విమెన్ యాంథెమ్ సాంగ్' మహిళల కోసం జాతీయ గీతం...!

మనల్ని ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మ.మహిళ వల్లనే జీవితం.

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేసిన 'వానవిల్లు' లోని సరికొత్త గీతం

ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటిస్తూ,దర్శకత్వం వహిస్తున్న సినిమా 'వానవిల్లు'.