కొత్త డైరెక్ట‌ర్‌తో యాంగ్రీ స్టార్‌

  • IndiaGlitz, [Saturday,June 06 2020]

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్నాయి. తెలుగు సినిమాల్లో ఒక‌ప్పుడు ఉన్న క‌మ‌ర్షియాలిటీ త‌గ్గిపోతుంది. ఎమోష‌న్స్‌, రియ‌ల్ కంటెంట్ చుట్టూ సినిమా తిరుగుతుంది. దీంతో కొత్త ద‌ర్శ‌కుల‌కు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. సీనియ‌ర్ హీరోలు ఇత‌ర స్టార్స్ అంద‌రూ డిఫ‌రెంట్ సినిమాల‌నే ట్రై చేస్తున్నారు. ఈ కోవ‌లో తెలుగు యాంగ్రీస్టార్ డా.రాజ‌శేఖ‌ర్ ఓ సినిమాతో స‌క్సెస్ కొట్టిన ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఇంత‌కూ ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. క‌రుణ‌కుమార్‌.

తొలి చిత్రం ప‌లాస 1978 సినిమాతో అటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించి ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు క‌రుణ కుమార్‌. ఈ సినిమా సక్సెస్‌తో ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ త‌న బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి ఓకే చేయించేసుకున్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు క‌రుణ కుమార్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని అల్లు అర‌వింద్‌తో కాకుండా మ‌రో నిర్మాత‌తో రాజ‌శేఖ‌ర్ హీరోగా చేయ‌బోతున్నాడ‌ట‌. ఇంత‌కు ఆ నిర్మాత ఎవ‌రో కాదు. జీవితా రాజ‌శేఖ‌ర్‌. ఇది వ‌ర‌కు గ‌రుడ‌వేగ‌, క‌ల్కి చిత్రాల నిర్మాణంలో భాగ‌మైన జీవిత ఈసారి కూడా నిర్మాత‌గా మారుతున్నార‌ట‌. త్వ‌రలోనే రాజ‌శేఖ‌ర్, క‌రుణ కుమార్ సినిమాను స్టార్ట్ చేసి థియేట‌ర్స్ దొర‌క్క‌పోయినా ఓటీటీలో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై రాజ‌శేఖ‌ర్‌, జీవిత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

కృష్ణ‌దేవ‌రాయ‌ల పాత్ర‌లో సాయితేజ్‌..!

గ‌త ఏడాది విడుద‌లైన ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రంతో త‌న కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు సాయితేజ్. ఇప్పుడు ఈ మెగాక్యాంప్ హీరో 'సోలో బ్రతుకే సో బెటర్'లో నటిస్తున్నాడు.

‘ఉప్పెన‌’ ఎడిటింగ్ పూర్తి..ర‌న్ టైమ్ లాక్డ్‌

మెగా క్యాంప్ హీరో సాయితేజ్ సోద‌రుడు. ఈ యువ హీరో తొలి చిత్రంగా ‘ఉప్పెన’ తెరకెక్కింది.

మీరా వ్యవహారంపై పూనమ్ షాకింగ్ ట్వీట్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

తాతయ్య ఉండుంటే నేనెప్పుడో హీరో..!

జూన్-06న మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జయంతి. 85వ జయంతి కావడంతో ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నటీనటులు,

పేద విద్యార్థులకు జగన్ సర్కార్ ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికే ప్రజలు.. మరీ ముఖ్యంగా పేద ప్రజల కోసం ఎన్నో ఉచిత పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.