తేజ్ మూడోసాంగ్ ను రిలీజ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్

  • IndiaGlitz, [Tuesday,February 07 2017]

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ జంటగా తెర‌కెక్కుతున్న చిత్రం 'విన్న‌ర్‌'. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఈ సినిమా రూపొందుతోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పాట‌ల‌ను ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. మొద‌టి సాంగ్‌ను మ‌హేష్‌, రెండో సాంగ్‌ను స‌మంత విడుద‌ల చేశారు. ఇప్పుడు మూడో సాంగ్‌ను త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ చేతుల మీదుగా విడుద‌ల చేస్తున్నారు. సాయిధ‌ర‌మ్ తేజ్‌, అన‌సూయ కాంబినేష‌న్‌లో రూపొందిన స్పెష‌ల్ సాంగ్ ఇది. సాంగ్స్ అన్నీ విడుద‌ల చేశాక ఈ నెల 19న ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించి, 24న సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

నాగ చైతన్య, సాయికొర్రపాటి, సురేష్ బాబు చిత్రం ప్రారంభం

నాగచైతన్య హీరోగా వారాహి చలన చిత్రం, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కృష్ణ ఆర్.పి.మారిముత్తు దర్శకత్వంలో సాయికొర్రపాటి, డి.సురేష్బాబు నిర్మాతలుగా కొత్త చిత్రం వారాహి చలన చిత్రం ఆఫీస్లో ఈరోజు ప్రారంభమైంది.

ఇద్దరు హీరోయిన్స్ తో అఖిల్

అఖిల్ సినిమా తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్ తన రెండో సినిమా చేయడానికి మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మనం, 24 వంటి విజయవంతమైన చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అఖిల్ తన రెండో సినిమా చేయబోతున్నాడు.

ఎన్టీఆర్ పై సినిమా తీస్తాః బాలయ్య

ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి,తన నటనతో ఆ పాత్రలకు ప్రాణం పోసిన తిరుగులేని కథానాయకుడు

మహేష్ కు కోర్టు ఆదేశం...

సూపర్ స్టార్ మహేష్,కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.

'సింగం3' చేయడం రెస్పాన్సిబిలిటీగా భావించాను - హీరో సూర్య

సూర్య, అనుష్క, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా హరి దర్శకత్వంలో రానున్న సినిమా `సింగం3`. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు.