శ్రీకాళ‌హ‌స్తిలో అనిత ప్ర‌త్యేక పూజ‌లు

  • IndiaGlitz, [Tuesday,September 20 2016]

నువ్వు నేను ఫేమ్ అనిత చాలా గ్యాప్ త‌రువాత తెలుగులో మ‌న‌లో ఒక‌డు అనే చిత్రంలో న‌టించింది. ఆర్.పి.ప‌ట్నాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన మ‌న‌లో ఒక‌డు త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే...హీరోయిన్ అనిత శ్రీకాళ‌హ‌స్తిలో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి రాహు కేతు పూజలు చేయించుకున్నారు.

అనంతరం మీడియాతో అనిత మాట్లాడుతూ....సంతానం కోసం రాహు కేతు పూజలు చేయించుకున్నాను. అలాగే మ‌న‌లో ఒక‌డు చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని శివ‌పార్వ‌తుల‌ను కోరుకున్నాను. ఈ దేవాల‌యం చాలా బాగుంది. దేవున్ని ద‌ర్శించుకున్న త‌ర్వాత తెలియ‌ని అనూభూతి క‌లిగింది అని తెలిపారు.