ఆ...హార్రర్ సీక్వెల్ లో అంజలి..

  • IndiaGlitz, [Saturday,January 02 2016]

ఆ..హార్ర‌ర్ మూవీ సీక్వెల్ లో అంజ‌లి న‌టిస్తుందట‌. ఇంత‌కీ ఏ హార్ర‌ర్ మూవీ అనుకుంటున్నారా..? రాజు గారి గ‌ది. ఓంకార్ తెర‌కెక్కించిన రాజు గారి గ‌ది చిన్న చిత్రాల్లో పెద్ద విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అశ్విన్, థ‌న్య బాల‌క్రిష్ణ‌న్ జంట‌గా న‌టించిన రాజు గారి గ‌ది హార్ర‌ర్ తో పాటు మంచి సందేశం కూడా అందించింది. ఈ సినిమా స‌క్సెస్ ఇచ్చిన స్పూర్తితో ఓంకార్ రాజు గారి గ‌ది సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్ర‌ధాన

పాత్ర కోసం అంజ‌లిని సంప్ర‌దించార‌ట‌. క‌థ విని అంజ‌లి ఓకె చెప్పింద‌ట‌. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. గీతాంజ‌లి సినిమాతో ఆక‌ట్టుకున్న అంజ‌లి మ‌ళ్లీ మ‌రో హార్ర‌ర్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్ర‌స్తుతం అంజ‌లి బాల‌య్య స‌ర‌స‌న‌ డిక్టేట‌ర్ మూవీలో న‌టించింది. శంక‌రాభ‌ర‌ణంలో న‌టించిన ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయిన అంజ‌లి డిక్టేట‌ర్, రాజు గారి గ‌ది సీక్వెల్ తో స‌క్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

More News

'నేను శైలజ' మూవీ రివ్యూ

‘కందిరీగ’ తర్వాత రామ్ కు సరైన హిట్ లేదు. మధ్యలో పండగచేస్తోతో పర్వాలేదనిపించినా సరైన కమర్షియల్ హిట్ కోసం చేయని ప్రయత్నం లేదు. అలాటి హిట్ కోసం చేసిన చిత్రమే ‘నేను..శైలజ’. హీరో హీరోయిన్ ను ప్రేమించడం, మధ్యలో హీరో తండ్రి కారణంగా వెళ్ళిపోవడం.

రాజమౌళి టైటిల్ తో విక్రమ్ సినిమా...

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

అఖిల్ చూపు ఆ సినిమా వైపు..

అక్కినేని అఖిల్ రెండవ సినిమా ఎవరితో ఉంటుంది..?ఎలాంటి సినిమా చేస్తారనే ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది.

సాయిథరమ్ తేజ్ సుప్రీమ్ టీజర్ రివ్యూ..

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్.ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.

అబ్బాయితో అమ్మాయి మూవీ రివ్యూ

ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రేమకు ఫ్యామిలీ ఎమోషన్స్ ను ముడుపెడుతూ వచ్చిన సినిమాల్లో కొన్నే మనసుకు హత్తుకుంటాయి. నాగశౌర్య, పల్లాక్ లల్వాని నటించిన అటువంటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అబ్బాయితో అమ్మాయి.