సెన్సేష‌న‌ల్ పాత్ర‌లో అంజ‌లి..?

  • IndiaGlitz, [Saturday,December 05 2020]

ఫొటో సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అంజలి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్లు, డిక్టేటర్, గీతాంజలి సహా పలు తెలుగు చిత్రాలతో తమిళంలోనూ ప్రేక్షకులను మెప్పించి మంచి గుర్తింపునే సంపాదించుకుంది. మధ్యలో లావుగా బొద్దుగా తయారైన ఈ అమ్మడు ఈ మ‌ధ్య ఫిజిక్‌పై ఫోక‌స్ పెట్టి మ‌రింత స్లిమ్‌గా మారింది. ఆనంద భైర‌వి, వ‌కీల్ సాబ్ అనే తెలుగు చిత్రాల‌తో పాటు త‌మిళంలో పూచాండి అనే హార‌ర్ సినిమాలో న‌టిస్తుంది. అలాగే క‌న్న‌డ‌లో శివ‌ప్ప సినిమాలోనూ న‌టిస్తుంది.

ఇవి కాకుండా నెట్‌ఫ్లిక్ కోసం రూపొందిన పావ క‌థైగ‌ల్ అనే వెబ్ అంత్రోపాల‌జీలో న‌టిస్తుంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో అంజ‌లి ఆస‌క్తిక‌ర‌మైన రోల్‌లో క‌నిపించ‌నుంది. ట్రైల‌ర్‌లో చూపించిన దాని ప్రకారం అంజ‌లి, క‌ల్కికొచ్లిన్ లెబ్బియ‌న్స్‌గా క‌నిపించ‌నున్నారు. ఓ రకంగా అంజలి షాకింగ్ పాత్రలో నటించిందనే అన్నారు. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 18న ప్రసారం కానుంది. ఇందులో ఇంకా ప్రకాశ్ రాజ్, సాయిపల్లవి, గౌతమ్ మీనన్, సీనియర్ నటి సిమ్రాన్ తదితరులు నటిస్తున్నారు.

More News

మ‌రోసారి అలాంటి టైటిల్‌తో మెగాస్టార్..!

వీలైనంత త్వ‌ర‌గా ఆచార్య సినిమాను పూర్తి చేసి లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టించాల‌ని చిరంజీవి భావిస్తున్నాడ‌ట‌.

బాల‌య్య కోసం ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌తో సినిమా.. ఓకే అంటాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ‌తో డైరెక్ట‌ర్ సంతోష్ జాగ‌ర్ల‌పూడి ఓ సినిమాను చేయాల‌ని అనుకున్నాడు.

కాంగ్రెస్‌లో ప్రక్షాళన మొదలైంది.. టీపీసీసీ అధ్యక్షుడిగా...

ఒకప్పుడు తెలంగాణను ఏలిన పార్టీ.. ఇప్పుడు పూర్తిగా వరుస ఎదురు దెబ్బలతో అల్లాడుతోంది. వరుస వైఫల్యాలు ఈ పార్టీ నేతల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాయి.

బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే గెస్ట్‌గా మహేష్!?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న `బిగ్‌బాస్-4` కార్యక్రమం తుది అంకానికి చేరువవుతోంది.

రాజమౌళి శిష్యుడు దర్శకత్వంలో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ‘కథ మొదలైంది’

దేశం గర్వించదగిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడైన సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో ‘కథ మొదలైంది’