close
Choose your channels

ఓ ఆట ఆడుకుంటున్న అంజ‌లి!

Tuesday, July 16, 2019 • తెలుగు Comments

ఓ ఆట ఆడుకుంటున్న అంజ‌లి!

తెలుగు ప‌డుచు అంజ‌లి ఓ ఆట ఆడుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఎవ‌రితో... ఎవ‌రిని...? ఎందుకు? అని ఊపిరాగేట‌న్ని ప్ర‌శ్న‌లు వేసేయ‌వ‌ద్దు. ఆమె ఆడుకోబోయేది వ్య‌క్తుల‌తో కాదు కాబ‌ట్టి. ఆమె బాస్కెట్ బాల్ కోచింగ్ తీసుకుంటున్నార‌ట‌. ఆమె త్వ‌ర‌లో ఓ చిత్రంలో బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిగా క‌నిపించ‌నున్నారు. కృష్ణ న్ జ‌య‌రాజ్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో అంజ‌లి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్‌. ఆయ‌న ఇంత‌కు ముందు `సొన్నా పురియాదు` ఓ కోలీవుడ్ చిత్రాన్ని తీశారు. 

ఈ తాజా చిత్రం ఫాంట‌సీ కామెడీ సినిమా. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. ఐశ్వ‌ర్య రాజేష్ క్రికెట్ క్రీడాకారిణిగా, ర‌ష్మిక మండ‌న్న క్రికెట్ క్రీడాకారిణిగా క‌నిపించ‌నున్న నేప‌థ్యంలోఅంజ‌లి బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్‌గా సంద‌డి చేయ‌నున్నార‌ట‌. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లుపెడ‌తారు. చెన్నైతో పాటు ఊటీలోనూ చిత్రీక‌రిస్తారు. మ‌రికొన్ని హిల్ స్టేష‌న్ల స్కౌటింగ్ కూడా జ‌రుగుతోంది. తెలుగులోనూ సైమ‌ల్‌టైనియ‌స్‌గా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. 

Get Breaking News Alerts From IndiaGlitz