విజ‌య్ ఆంటోనితో అంజ‌లి

  • IndiaGlitz, [Thursday,September 07 2017]

తెలుగమ్మాయి అంజ‌లి.. త‌మిళంలోనే ఎక్కువ‌గా సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. 'అంగాడి తెరు' (షాపింగ్ మాల్‌), 'ఎంగేయుం ఎప్పోదుం' 'జ‌ర్నీ), 'ఇరైవి' త‌దిత‌ర త‌మిళ‌ చిత్రాల‌తో అంజ‌లి మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది. ఇటీవ‌లే ఆండ్రియా న‌టించిన 'తారామ‌ణి' లో ప్ర‌త్యేక పాత్ర పోషించిన అంజ‌లికి.. తాజాగా మ‌రో మంచి అవ‌కాశం ద‌క్కింది.

'బిచ్చ‌గాడు' ఫేం విజ‌య్ ఆంటోని న‌టిస్తున్న స‌స్పెన్స్ డ్రామా 'కాళి' చిత్రంలో న‌లుగురు హీరోయిన్ల‌లో ఒక‌రిగా అంజ‌లి ఎంపికైంది. 'వ‌ణ‌క్క‌మ్ చెన్నై' అనే త‌మిళ‌ చిత్రాన్ని రూపొందించిన కృతికా ఉద‌య‌నిధి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ త‌మిళ‌ చిత్రం డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌య్యే దిశ‌గా నిర్మాణం జ‌రుపుకుంటోంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాద‌మ‌య్యే అవ‌కాశం లేక‌పోలేదు. అంజ‌లితో పాటు సునైన‌, అమృత‌, శిల్పా మంజునాథ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారీ సినిమాలో.

More News

నివేదా.. ట్రాక్ మారుస్తోందా?

'జెంటిల్ మన్','నిన్నుకోరి'చిత్రాలతో తెలుగువారిని ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్.

'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' పాటల విడుదల

ధర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురామ్ రొయ్యూరుతో కలిసి స్వీయ దర్శకత్వంలో

దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా B.tech బాబులు ప్రచార చిత్రం విడుదల

JP క్రియేషన్స్ బ్యానర్ లో ధన జమ్ము నిర్మాతగా శ్రీను ఇమంది దర్శకత్వంలో

కేసీఆర్ స్ఫూర్తిదాయక జీవిత ప్రస్థానానికి వెండితెర దృశ్యరూపమే గులాల్

ప్రపంచవ్యాప్తంగా జరిగిన అహింసాయుత పోరాటాల్లో తెలంగాణ సాధన ఉద్యమం అగ్ర భాగాన వుంటుంది.

ఉంగరాల రాంబాబుకు 'యు బై ఏ' సెన్సార్ సర్టిఫికెట్....సెప్టెంబర్ 15న గ్రాండ్ రిలీజ్

సునీల్ హీరోగా,మియాజార్జ్ హీరోయిన్ గా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉంగరాల రాంబాబు.