close
Choose your channels

మరో క్యాచీ పదం.. సరిలేరు నీకెవ్వరు‌లో వినిపించబోతోంది!

Wednesday, January 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మరో క్యాచీ పదం.. సరిలేరు నీకెవ్వరు‌లో వినిపించబోతోంది!

కొత్త పదాలను సృష్టించి.. వాటిని సినీ జనాల నోళ్లలో నానేలా చేయడంలో టాలీవుడ్ డైరెక్టర్లు ముందుంటారు. అప్పటి జంధ్యాల నుంచి ఇప్పటి అనిల్ రావిపూడి వరకు ఎన్నో పదాలు తెలుగు తెరపై దొర్లాయి. క్యాచీ పదాల విషయానికొస్తే నేటి తరంలో అనిల్ రావిపూడి గుర్తుకొస్తారు. రాజా ది గ్రేట్‌లో 'హు..హు..హూ..హూ..' అన్నా, ఎఫ్2లో 'అంతేగా..అంతేగా' అన్నా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రోజూ వారీ పనుల్లో ఈ పదాలు చాలా కామన్ అయిపోయాయి. అప్పట్లో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో ఎక్కువగా ఇవి వినిపించేవి. ఎంద చాట, కాట్రవల్లి లాంటి ఊతపదాలు ప్రేక్షకులను తెగ నవ్వించేవి. అలాగే ఇప్పుడు అనిల్ సినిమాల్లో ఉపయోగించే ఊతపదాలు.. జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సంక్రాంతికి విడుదల కానున్న మహేష్ బాబు‌ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో అనిల్ మరో ఊతపదాన్ని పరిచయం చేస్తున్నట్టు టాక్. హీరోయిన్ రష్మిక మందనా ఫ్యామిలీలో అది బాగా వినపడుతుందని అంటున్నారు. 'నెవ్వర్ బిఫోర్... ఎవర్ ఆఫ్టర్' అనే టైపులో ఈ ఊతపదం ఉండనుందని సమచారం. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, సంగీత తదితరులు నటించారు. సుమారు దశాబ్దం తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి వెండితెరపై దర్శనం ఇస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.