సుకుమార్ టీమ్ నుండి మరో డైరెక్టర్

  • IndiaGlitz, [Tuesday,May 19 2020]

నేటి తరం అగ్ర దర్శకుల్లో సుకుమార్ తన దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న వారిని బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. తన టీమ్ సభ్యుల్లో ఎవరి కథైనా నచ్చితే సుకుమార్ సినిమాను ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడు. అంతే కాకుండా తను డైరెక్ట్ చేయాలనుకుని డైరెక్ట్ చేయ‌లేక‌పోతున్న క‌థ‌ల‌తోనూ సినిమాను సుకుమార్ నిర్మిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌తో పాటు మ‌రో నిర్మాతతో కూడా సుకుమార్ చేతులు క‌లిపి సినిమా నిర్మాణంలో భాగ‌స్వామ్యం వ‌హిస్తున్నాడు.

సుకుమార్ శిష్యుల్లో ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్‌తో కుమారి 21 ఎఫ్ సినిమాను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత బుచ్చిబాబు సానాతో ఉప్పెన సినిమాను కూడా నిర్మించాడు సుకుమార్‌. ఇప్పుడు మ‌రోసారి ప‌ల్నాటి సూర్య‌ప్రతాప్‌తో మ‌రోసారి 18 పేజీస్ సినిమాను నిర్మిస్తున్నాడు. కాగా.. ఇప్పుడు శ్రీకాంత్ అనే మ‌రో ద‌ర్శ‌కుడు సుకుమార్ టీమ్ నుండి మెగాఫోన్ ప‌ట్ట‌నున్నాడ‌ట‌. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్ నిర్మించ‌నున్నాడ‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రంలో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించే అవ‌కాశం ఉంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజా నిజాలు తెలియాలంటే మ‌రికొన్నిరోజులు ఆగితే స‌రిపోతుంది.

More News

రంగనాయకమ్మపై సీఐడీ కేసు.. అసలేం జరిగింది!?

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్నదో.. నష్ట పరిహారం ఎన్నిరోజుల్లో ఇచ్చిందో అందరికీ తెలిసిందే.

నందమూరి బాలయ్యపై చార్మీ కామెంట్స్..

నందమూరి బాలకృష్ణపై నటి కమ్ నిర్మాత చార్మీ కామెంట్స్ చేసింది. ఇటీవలే తాను ఇక నటించనని.. ఇది వందకు రెండొందల శాతం పక్కా అని చెప్పిన

జూన్ 8 నుంచి పది పరీక్షలు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. జూన్-08 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

విరాట్ కోహ్లి బ‌యోపిక్‌.. కండీష‌న్ అప్లై

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తోంది. పలు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ వ్య‌క్తుల జీవిత చ‌రిత్ర‌ల‌ను సినిమాల రూపంలో మ‌లుస్తున్నారు.

సినీ ఇండ‌స్ట్రీ గురించి రామ్ ట్వీట్‌

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప‌లు రంగాల్లో సినీ పరిశ్ర‌మ ముందు వ‌రుస‌లో ఉంది. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టం, షూటింగ్స్ లేక‌పోవ‌డం వంటి కార‌ణాలతో సినీ ప‌రిశ్ర‌మ స్తంభించింది.