కాంగ్రెస్ లో మరో క్రమశిక్షణ ఉల్లంఘన


Send us your feedback to audioarticles@vaarta.com


పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తుంటారు. మొన్నటికిమొన్న సొంత పార్టీ నేతల్నే తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు తీన్మార్ మల్లన్న. క్రమశిక్షణారాహిత్యం కింద ఆయనపై వేటు వేసి 24 గంటలైనా గడవకముందే అలాంటిదే మరో ఘటన తెలంగాణ కాంగ్రెస్ లో కనిపించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశంపై జరిగింది. ఇదేదో అధిష్టానానికి చెప్పి పెట్టిన మీటింగ్ కాదు. మున్నూరు కాపు నేతలంతా పార్టీలకు అతీతంగా వీహెచ్ ఇంట్లో పెట్టుకున్న మీటింగ్.
దీనిపై ఏఐసీసీ సీరియస్ అయింది. ప్రతిపక్ష పార్టీలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీ కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి.. విమర్శలు చేయడం బాగాలేదంటూ అభిప్రాయపడింది.
కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. అయితే వీహెచ్ మాత్రం ఈ అసహనాన్ని లైట్ తీసుకున్నారు. తమ సమావేశంలో కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ విమర్శించలేదని, కేవలం అదొక ఆత్మీయ సమావేశంగా మాత్రమే జరిగిందన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com