close
Choose your channels

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రంలో మరో హీరో

Monday, May 25, 2020 • తెలుగు Comments

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రంలో మరో హీరో

అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను పూర్తి చేసేశారు. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగి ఉంటే ఈపాటి ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమా సెట్స్ పైకి వెళ్లి ఉండేది. కానీ క‌రోనా ప్ర‌భావంతో త్రివిక్ర‌మ్ ప్లానింగ్ మారింది. అందుకు కార‌ణం ఎన్టీఆర్ పూర్తి చేయాల్సిన ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ పూర్తి కాక‌పోవ‌డ‌మే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి కావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. దీంతో త్రివిక్ర‌మ్‌కు కావాల్సినంత స‌మ‌యం ద‌క్కింది.

లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు త్రివిక్ర‌మ్ ఇప్పుడు దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని వృథా చేయాల‌నుకోవ‌డం లేద‌ట‌. త‌దుప‌రి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. వెంక‌టేశ్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ను తయారు చేసే ప‌నిలో త్రివిక్ర‌మ్ బిజీగా ఉన్నార‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రంలో వెంక‌టేశ్‌తో పాటు నేచుర‌ల్ స్టార్ నాని కూడా న‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz