చిరు 153 లిస్టులో మ‌రో హీరోయిన్‌!!

చిరు 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫర్’ను రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ర‌న్‌రాజార‌న్‌, సాహో చిత్రాల ద‌ర్శ‌కుడు సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర‌తో పాటు నాలుగుపాత్ర‌లు క‌థ‌లో చాలా కీల‌కంగా ఉంటాయి. ఏ పాత్ర‌లో ఎవ‌రు న‌టించ‌నున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నాలుగు పాత్ర‌ల్లో ముందుగా చెప్పుకోవాల్సింది. చిరు చెల్లెలు పాత్ర‌. ఇందులో జెనీలియా, సుహాసిని, ఖుష్బూ వంటి వారి పేర్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి. ఇప్పుడు ఈ లిస్టులో మ‌రో చిరు హీరోయిన్ పేరు విన‌ప‌డుతుంది. ఆమె ఎవ‌రో కాదు.. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న రోజా. అయితే రాజ‌కీయాల ప‌రంగా రోజాకు,చిర‌కు ప‌డ‌లేదు. మ‌రిప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తారా? అది కూడా అన్నా చెల్లుళ్లుగా అనేది తెలియాలంటే వేచి చూడాలి.

మ‌రో వైపు క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే చిరంజీవి త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేసి త‌దుప‌రి లూసిఫ‌ర్ రీమేక్‌పై ఫోక‌స్ పెట్ట‌బోతున్నార‌ట‌. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర‌ను తెలుగులో రానా పోషించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి చిరు సోద‌రుడు, ఖుష్బూ భ‌ర్త పాత్రలో జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుత‌న్నాయి.

More News

ప‌వ‌న్ మొద‌లెట్టేద‌ప్పుడేన‌ట‌!!

సినిమాలకు రెండేళ్లు దూరమై రాజకీయాల్లోనే గడిపిన జ‌న‌సేనాని,ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాడు.

ఇండిపెండెన్స్ డే  కానుకగా అజయ్ దేవగన్ ‘మైదాన్’

భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`.

పోలీసులపై గ్యాంగ్‌స్టర్ కాల్పులు.. 8 మంది పోలీసులు మృతి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడటంతో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా..

అది ఫేక్ న్యూస్.. నమ్మకండి: భారత్ బయోటెక్

ప్రముఖులకు సంబంధించిన ఫోటో కనిపిస్తే చాలు.. దాని పూర్వాపరాలు తెలుసుకోకుండా.. ఆ ఫోటో చుట్టూ ఓ కథ అల్లేసి వైరల్ చేయడం సోషల్ మీడియాలో

ఏపీ కరోనా బులిటెన్ విడుదల..

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నేడు ఏపీలో మొత్తంగా 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.