ఊపిరిలో మరో హీరోయిన్...

  • IndiaGlitz, [Thursday,December 24 2015]

నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఈ సినిమా ప్ర‌స్తుతం వైజాగ్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. నాగార్జున పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్త‌వుతుంది. అయితే ఈ చిత్రంలో అందాల తార అనుష్క అతిధి పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు అనుష్క‌తో పాటు మ‌రో హీరోయిన్ శ్రియ కూడా అతిథి పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో నాగ్ తో క‌ల‌సి శ్రియ సంతోషం, నేనున్నాను, మ‌నం చిత్రాల్లో న‌టించింది. ఇప్పుడు ఊపిరి లో శ్రియ కూడా న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గుతుండ‌డంతో ఊపిరి సినిమా పై మ‌రింత క్రేజ్ పెరుగుతుంది. ఇంత‌కీ ఊపిరి ఎలా ఉంటుంద‌నేది తెలియాలంటే స‌మ్మ‌ర్ వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

విదేశాలలో హల్ చల్ చేయనున్న లారెన్స్ 'కాంచన'

రాఘవ లారెన్స్ నటించి దర్శకత్వం వహించిన 'కాంచన'చిత్రం చైనీస్,కొరియన్ మరియు థాయ్ భాషల్లో నిర్మాణానికి సిద్ధమవుతోంది.

జత కలిసే టీమ్ ను అభినందించిన పూరి జగన్నాథ్

అశ్విన్,తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మించిన చిత్రం ‘జతకలిసే’.‘అలామొదలైంది’ ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటించింది.

నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదండి..ఆవిషయంలో పూర్తి నమ్మకం ఉంది - హీరోయిన్ రెజీనా

ఎస్.ఎం.ఎస్,రొటీన్ లవ్ స్టోరి,రారా క్రిష్ణయ్య,కొత్త జంట,పవర్,పిల్లా నువ్వులేని జీవితం...తదితర చిత్రాలతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న హీరోయిన్ రెజీనా.

డిసెంబర్ 27న 'నాన్నకు ప్రేమతో..' ఆడియో

యంగ్ టైగర్ ఎన్టీఆర్,ఆర్య సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'.

సౌఖ్యం మూవీ రివ్యూ

సౌఖ్యం అనే మాటను వింటుంటే మనసుకు సుఖంగా ఉంటుంది. అహర్నిశలూ వ్యక్తి పాటుపడేది సౌఖ్యంగా జీవించడానికే. కుటుంబం సౌఖ్యంగా ఉండాలి. కుటుంబంతో పాటు ఇరుగూపొరుగూ కూడా సౌఖ్యంగా ఉండాలనుకునే హీరో కేరక్టరైజేషన్ తో అల్లుకున్న కథే 'సౌఖ్యం' అని చిత్ర యూనిట్ పలు సందర్భాల్లో చెప్పింది.