close
Choose your channels

మ‌రో హిస్టారిక్ మూవీ ఘాజీ ద‌ర్శ‌కుడు

Saturday, June 27, 2020 • తెలుగు Comments

మ‌రో హిస్టారిక్ మూవీ ఘాజీ ద‌ర్శ‌కుడు

సంక‌ల్ప్ రెడ్డి.. `ఘాజీ`, `అంత‌రిక్షం` సినిమాలో అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించాడు. ఇప్పుడు కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఓ భారీ యాక్ష‌న్ సినిమా చేస్తున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈసారి సంకల్ప్ త‌న సినిమాను హిందీలో తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ సినిమాలో హీరో ఎవ‌రో తెలుసా? విద్యుజ‌మాల్‌. క‌త్తి, శ‌క్తి, సికింద‌ర్ వంటి చిత్రాల్లో న‌టించాడు. ఇప్పుడు సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమాలో కమాండ‌ర్2 త‌ర్వాత న‌టిస్తున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో నిజఘటనల ఆధారంగా సినిమా తెర‌కెక్క‌నుంది. సాధార‌ణంగా తొలి రెండు సినిమాల‌ను సెట్స్‌లో తీసిన సంక‌ల్ప్ మూడో చిత్రాన్ని జ‌మ్మూకాశ్మీర్‌, ఢిల్లీ త‌దిత‌ర ప్రాంతాల్లోని రియ‌ల్ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించ‌బోతున్నాడు.

షార్ట్ ఫిలిం చేయాల‌నుకున్న ఓ వ్య‌క్తి. రానా ద‌గ్గుబాటికి, నిర్మాత పివిపికి క‌థ న‌చ్చ‌డంతో ద‌శ తిరిగింది. ద‌ర్శ‌కుడిగా మారాడు. తొలి సినిమాను అండ‌ర్ వాట‌ర్‌లో ఉండే స‌బ్‌మెరైన్ మీద `ఘాజీ` పేరుతో తెర‌కెక్కించాడు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత అంత‌రిక్ష్య నేప‌థ్యంలో తెర‌కెక్కిన అంత‌రిక్ష్యం 9000 కెఎంపిహెచ్ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. త‌ర్వాత ఈ ద‌ర్శ‌కుడిని ఎవ‌రూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని సంక‌ల్ప్ యాక్ష‌న్ మూవీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌.

Get Breaking News Alerts From IndiaGlitz