close
Choose your channels

ప్రేమకథల స్పెషలిస్ట్‌కి జ్ఞానోదయం.. చేతులు కాల్చుకుంది చాలు, పాత జోనర్‌కి షిఫ్ట్

Monday, September 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రేమకథల స్పెషలిస్ట్‌కి జ్ఞానోదయం.. చేతులు కాల్చుకుంది చాలు, పాత జోనర్‌కి షిఫ్ట్

నిన్ను కోరి, మజిలి లాంటి క్యూట్ లవ్‌స్టోరీస్‌తో మరో శేఖర్ కమ్ముల అన్న పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ. తనుకు గుర్తింపు తెచ్చిపెట్టిన జోనర్ విడిచిపెట్టి.. ‘టక్‌ జగదీష్’ వంటి మాస్ మసాలా సినిమా తీసి దెబ్బ తిన్నాడు. దీంతో తనకు లవ్‌స్టోరీస్ మాత్రమే నప్పుతాయని.. తన నుంచి ప్రేక్షకులు కోరుకుంటున్నది కూడా ఆ తరహా చిత్రాలేనని ఫిక్సయ్యాడు. దాంతో మళ్లీ తనకు అలవాటైన జోనర్‌‌కి వెళ్లిపోతున్నాడు శివ.

ప్రేమకథల స్పెషలిస్ట్‌కి జ్ఞానోదయం.. చేతులు కాల్చుకుంది చాలు, పాత జోనర్‌కి షిఫ్ట్

అతని నెక్స్ట్ మూవీ కూడా ఓ ప్రేమకథేనని, తనకెంతో ఇష్టమైన వైజాగ్ బీచ్‌లో కూర్చుని కథ రాస్తున్నానని చెబుతూ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు. సముద్ర కెరటాలు ఎంత సహజంగా ఉంటాయో తన సినిమా కూడా అంతే సహజంగా ఉంటుందన్నాడు. అంతవరకు బానే ఉంది కానీ ‘‘ ఎన్‌ఎన్‌4’’ అని హ్యాష్‌ట్యాగ్‌ ఇవ్వడంతో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ కొత్త డౌట్స్ మొదలయ్యాయి. నిజానికి శివ తన నెక్స్ట్‌ మూవీ విజయ్ దేవరకొండతో చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి గతంలోనే ఆయనే స్వయంగా అనౌన్స్ చేశాడు.

ప్రేమకథల స్పెషలిస్ట్‌కి జ్ఞానోదయం.. చేతులు కాల్చుకుంది చాలు, పాత జోనర్‌కి షిఫ్ట్

పూరితో విజయ్ చేస్తున్న ‘లైగర్‌‌’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో వీళ్లిద్దరి కాంబోలో మూవీ త్వరలోనే సెట్స్‌కి వెళ్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నాలుగో సినిమా కోసం ప్రేమకథ రాస్తున్నానని శివ అనడంతో దేవరకొండ సినిమా వాయిదా పడిందా లేక పూర్తిగా ఆగిపోయిందా అనే సందేహాలు మొదలయ్యాయి. టక్ జగదీష్ రిజల్ట్ చూశాక విజయ్ మనసు మార్చుకున్నాడని, అందుకే నాగచైతన్యతో శివ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడని ఫిలింనగర్ టాక్. మరి ఈ పుకార్లకు చెక్ పడాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.