తెలుగులో రీమేక్ కానున్న మ‌రో మ‌ల‌యాళ చిత్రం

  • IndiaGlitz, [Saturday,July 04 2020]

తెలుగు ప్రేక్ష‌కుడు కాన్సెప్ట్ చిత్రాల‌కు ఓటేస్తున్నాడు. దీంతో కొత్త ద‌ర్శ‌కులు కొత్త కొత్త కాన్సెప్టుల‌తో సినిమాలు చేస్తున్నారో మ‌రో వైపు ప‌ర భాష‌ల్లో హిట్ చిత్రాల‌ను తెలుగులో రీమేక్ చేయ‌డానికి మేక‌ర్స్ ఆస‌క్తి చూపుతున్నారు. అందులో భాగంగా మ‌ల‌యాళ చిత్రాల‌ను కొన్ని తెలుగులో రీమేక్ కానున్నాయి. ప్ర‌స్తుతం చిరంజీవి ‘లూసిఫ‌ర్‌’ను తెలుగులో రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇది కాకుండా మల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్’ చిత్రాన్ని తెలుగులో ర‌వితేజ‌, రానాల‌తో రీమేక్ చేయ‌నున్నారు. అలాగే మ‌లయాళంలో విజ‌య‌వంత‌మైన ‘డ్రైవింగ్ లైసెన్స్’ హ‌క్కుల‌ను కూడా తెలుగు నిర్మాత‌లు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వీటి లిస్టులో రీసెంట్ మ‌ల‌యాళ హిట్ ‘క‌ప్పేళ’‌ను తెలుగులో రీమేక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట తెలుగు నిర్మాత‌లు.

తెలుగులో ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థే, ‘క‌ప్పేళ’ రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంద‌ని టాక్‌. ఓ యువ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. మరి ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తారు? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

సుశాంత్‌ది హత్యేనంటూ సంచలనం రేపుతున్న పోస్ట్!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యోదంతం ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా యావత్భారతాన్ని కలిచివేసింది.

చిరు 153 లిస్టులో మ‌రో హీరోయిన్‌!!

చిరు 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫర్’ను రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.

ప‌వ‌న్ మొద‌లెట్టేద‌ప్పుడేన‌ట‌!!

సినిమాలకు రెండేళ్లు దూరమై రాజకీయాల్లోనే గడిపిన జ‌న‌సేనాని,ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాడు.

ఇండిపెండెన్స్ డే  కానుకగా అజయ్ దేవగన్ ‘మైదాన్’

భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`.

పోలీసులపై గ్యాంగ్‌స్టర్ కాల్పులు.. 8 మంది పోలీసులు మృతి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడటంతో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా..