YCP:వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా.. జనసేనలో చేరేందుకు సిద్ధం..

  • IndiaGlitz, [Wednesday,March 06 2024]

వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వరుసపెట్టి నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. కాపులకు జరుగుతున్న వివక్షను చూసి విసిగిపోయి పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఒక కార్పోరేటర్ స్థానం కూడా తమ సామాజికవర్గానికి ఇప్పించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో అవమానాలను భరిస్తూ వైసీపీ కోసం అంకిత భావంతో పనిచేశానని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తానని ఇవ్వలేదని.. చివరకు రాజ్యసభ సీటు ఇస్తానని కూడా మాట తప్పారని మండిపడ్డారు. ఆఖరికి ఏపీఐసీసీ చైర్మన్ పదవి ఆశ చూపి నిరాశకు గురిచేశారని ఫైర్ అయ్యారు. తన సొంత నిర్మాణ సంస్థ జేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌ ద్వారా వివిధ ప్రాంతాల్లో చేసిన పనులకు బిల్లులు రూ.73 కోట్లు ఆపేశారని వాపోయారు. వారికి అనుకూలమైన వారికి మాత్రమే బిల్లులు మంజూరు చేయించుకున్నారని ఆరోపించారు. రాయలసీమలో బలిజలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజల సమస్యలు పరిష్కరించలేని దుస్థితి తీసుకొచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిరంజీవి కుటుంబంతో తనకు 2002 నుండి అవినాభావ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. పవన్ కల్యాణ్‌ని కలవగానే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. బలిజలు అంటే జగన్‌కు విపరీతమైన ద్వేషం అని ఆరోపించారు. గురువారం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి చేరుతున్నట్లు తెలిపారు. కాగా రాయలసీమలో బలిజ వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే శ్రీనివాసులు కావడం గమనార్హం.

చిత్తూరు ఇంఛార్జ్‌గా విజయానందరెడ్డిని నియమించండతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పినా అది కూడా దక్కలేదు. దీంతో ఆయన ఆగ్రహంతో ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఆ వెంటనే పార్టీ నుంచి శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. తాజాగా ఆయన జనసేనలో చేరనుండటంతో తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

More News

చంద్రబాబు బీసీలను వాడుకుంటే.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు..

దివంగత సీఎం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గరి నుంచి బడుగు, బలహీన వర్గాలకు మద్దతుగా నిలిచేశారు. ఆయన హయంలో ఎంతో మంది బీసీలు, ఎస్సీలు, నిమ్న కులాలకు చెందన వారు చట్టసభల్లో అడుగుపెట్టేవారు.

CM Jagan:నాన్న శంకుస్థాపన చేస్తే.. కొడుకు ప్రారంభించాడు.. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే..

ప్రకాశం జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరింది. ఎన్నో దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది.

Janhvi Kapoor:మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్‌చరణ్ సరసన జాన్వీకపూర్..

అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.

PM Modi:తొలి అండర్ వాటర్ మెట్రో రైలు ప్రారంభం.. విద్యార్థులతో కలిసి ప్రయాణించిన ప్రధాని మోదీ

దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలును పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రధాని మోదీ ప్రారంభించారు.

Mudragada:వైసీపీలోకి ముద్రగడ.. ముహుర్తం కూడా ఖరారు..!

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడూ ఏ నేత ఏ పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి నెలకొంది.