వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్..

  • IndiaGlitz, [Tuesday,September 22 2020]

వాట్సాప్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులకు అందుబాటులో ఉండేలా వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే వాట్సాప్ వినియోగదారుల భద్రత కోసం ఫింగర్ ప్రింట్ ఆప్షన్‌ను తీసుకొచ్చిన వాట్సాప్.. మరో అదిరిపోయే ఆప్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. మొదట్లో మనకు వాట్సాప్ నుంచి పంపించిన మెసేజ్‌ను డిలీట్ చేసే అవకాశమే లేదు. దీనిని వాట్సాప్ ఆ తరువాత అధిగమించింది. అయితే దానిలోనూ ఓ డ్రా బ్యాక్ ఉంది.

ఇప్పటి వరకూ మనం అవతలి వ్యక్తికి పంపిన వాట్సాప్ టెక్ట్స్, ఫోటో, ఎమోజీ, వీడియోలను నిర్ణీత కాలంలో మాత్రమే డిలీట్ చేసే అవకాశం ఉంది. ఆ సమయం దాటిందంటే వాటిని డిలీట్ చేయడం కుదరదు. అయితే వాట్సాప్ ఈ అవరోధాన్ని సైతం ఇక నుంచి అధిగమించనుంది. ఈ మేరకు సెల్ఫ్ డిస్ట్రెక్టింగ్ ఆప్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ ఆప్షన్ కారణంగా మనం అవతలి వాళ్లకు పంపించిన మెసేజ్ ఎప్పుడు డిలీట్ చేయాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. దీనికోసం సెండ్ బటన్ పక్కన టైమర్‌ను అందుబాటులోకి వాట్సాప్ తీసుకు వచ్చింది.

మనం మెసేజ్, ఫోటో, ఎమోజీ, వీడియో ఏదైనా సరే అవతలి వ్యక్తికి సెండ్ చెయ్యడానికి ముందు టైమర్‌లో టైమ్‌ను సెట్ చేసుకుని ఆ తరువాత సెండ్ బటన్ నొక్కాలి. దీంతో అవతలి వ్యక్తి ఫోన్ నుంచి మనం పంపిన సమాచారం టైమర్‌లో సెట్ చేసిన సమయం అవగానే డిసప్పియర్ అవుతుంది. అంతే కాకుండా వాట్సాప్ చాటింగ్ నుంచి మనం బయటకు రాగానే ఆటోమేటిక్‌గా మనం పంపిన మేటర్ అంతా అవతలి వ్యక్తి ఫోన్ నుంచి డిలీట్ అయిపోయేలా వాట్సాప్ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్లన్నింటినీ మొదట బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

More News

విశాల్‌కు హైకోర్టు నోటీసులు

హీరో, నిర్మాత అయిన విశాల్‌ దర్శకుడిగా మారి 'డిటెక్టివ్‌ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

మల్టీపుల్‌ స్కెలోరోసిస్‌పై అవగాహన పెంచుతోన్న కీరవాణి

ప్రముఖ సంగీత దర్శుకుడు ఎం.ఎం.కీరవాణి కరోనా వారియర్స్‌గా కరోనా నుండి కోలుకున్న వారికి పిలుపునిచ్చారు.

బన్నీని కలిసేందుకు సరికొత్త మార్గం ఎంచుకున్న అభిమాని..

అభిమాన హీరోని కలుసుకునేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడో యువకుడు. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు.

నాగ‌శౌర్య రిలీజ్ చేసిన రాజ్ త‌రుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...`లోని కృష్ణ‌వేణి వీడియో సాంగ్‌

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..!

ఏపీ టీడీపీ నూతన కమిటీపై కసరత్తు పూర్తి అయ్యింది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని సమాచారం.