close
Choose your channels

టాలీవుడ్‌లోకి మ‌రో కొత్త హీరోయిన్‌

Wednesday, July 17, 2019 • తెలుగు Comments

టాలీవుడ్‌లోకి మ‌రో కొత్త హీరోయిన్‌

టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్‌కు స్థానం ఎప్పుడూ ఉంటుంది. మాలీవుడ్‌, శాండిల్ వుడ్ హీరోయిన్స్ హ‌వా ఈ మ‌ధ్య ఎక్కువ అవుతుంది. పూజా హెగ్డే, ర‌ష్మిక‌, న‌భా న‌టేశ్‌లు వ‌రుస సినిమాలు చేస్తున్నారు. కాగా.. ఇప్పుడు మ‌రో క‌న్న‌డ భామ తెలుగు సినీ రంగ ప్ర‌వేశం చేయ‌నుంది. శ‌ర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై కిశోర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `శ్రీకారం` సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా క‌న్న‌డ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన ఆషికా రంగ‌నాథ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశార‌ట‌. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం రానుంది. ఈ చిత్రానికి సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండ‌గా.. మిక్కి జె.మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz