చిరు కెరీర్లో మరో రికార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల్లోకి మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. `ఖైదీ నంబర్ 150` సినిమాతో వందకోట్ల క్లబ్లో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఓవర్సీస్లో 2 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసింది. కాగా.. ఇప్పుడు చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`తో మరో మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్లో ఈ సినిమా 2.5 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసింది. ఇలా రెండు వరుస చిత్రాలతో ఓవర్సీస్లో 2 మిలియన్ డాలర్స్ వసూళ్లను సాధించిన హీరోగా చిరంజీవి ఓ కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.230 కోట్ల వసూళ్లను సాధించినట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించగా అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చాసుదీప్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు మూడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో సినిమా తెరకెక్కింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తనయుడు రామ్‌చరణ్ అన్ కాంప్రమైజ్డ్గా నిర్మించారు. ప్యాన్ ఇండియా చిత్రంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్‌ను గట్టిగానే రాబట్టుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.