close
Choose your channels

మ‌రో హిట్ సినిమాకు బాలీవుడ్‌లో సీక్వెల్‌

Monday, June 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రో హిట్ సినిమాకు బాలీవుడ్‌లో సీక్వెల్‌

బాలీవుడ్‌లో ఓ సినిమా స‌క్సెస్ అయితే దానికి సీక్వెల్ చేయ‌డం ఓ అన‌వాయితీ అనేలా సినిమాలు వ‌స్తున్నాయి. `కిక్ 2`, `ద‌బాంగ్ 3`, `రేస్ 3`, `ధూమ్ 3`, `హౌస్‌ఫుల్ 4`, `సింగం 2`.. ఇలా ఈ వ‌రుస‌లో చాలా సినిమాలే ఉన్నాయి. కాగా ఇప్పుడు మ‌రో సినిమాకు సీక్వెల్ సిద్ధం కానుంద‌ని బాలీవుడ్ సినీ వ‌ర్గాల స‌మాచారం. ఆ సినిమా ఏదో కాదు.. మ‌న తెలుగు సినిమా రీమేక్ కావ‌డం మ‌రో విశేషం.

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెలుగులో విజ‌య‌వంత‌మైన `విక్ర‌మార్కుడు` సినిమాను హిందీలో `రౌడీ రాథోడ్‌` పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్‌కుమార్ హీరోగా నటించారు. బాలీవుడ్‌లోనూ సినిమా విజ‌య‌వంత‌మైంది. బాలీవుడ్ రీమేక్‌కి ప్ర‌భుదేవా ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ప్ర‌భుదేవా `రౌడీ రాథోడ్‌`కు సీక్వెల్‌ను తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. స‌ల్మాన్‌ఖాన్‌తో `ద‌బాంగ్ 3` సినిమా షూటింగ్ పూర్తి కాగానే ప్ర‌భుదేవా సీక్వెల్‌పై వ‌ర్క్ చేయ‌నున్నాడని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.