జెట్ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ విమాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ బుధవారం అర్ధరాత్రి నుంచి పూర్తిగా సేవలు నిలిపివేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న 24 గంటలు లోపే జెట్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గురువారం నాటి మార్కెట్‌లో ఒకట్రెండు కాదు ఏకంగా 30శాతం నష‍్టపోవడంతో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కాగా.. నలుగురుబిడ్డర్లు వాటాల కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నారన్న అంచనాలున్నాయి. దీంతో జెట్ షేర్లు ప్రస్తుతం 26 శాతం నష్టంతో 179 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే ఇది మరింత మెరుగుపడితే ఎయిర్‌వేస్‌కు మంచి రోజులు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. జెట్ ఎయిర్‌‌వేస్ సంక్షోభంలో తీసుకున్న నిర్ణయంతో ఇతర కంపెనీల సేవలకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది. జెట్ షట్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించిన అనంతర స్పైస్‌జెట్‌‌ తన విమాన సర్వీసులను సంఖ్యను మరింత పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో ఈ కౌంటర్లో భారీగా కొనుగోళ్లు చేయడానికి బిడ్డర్లు ముందుకొస్తున్నారు. ఇప్పటికే స్పైస్‌జెట్ ఆరు విమాన సర్వీసులు దింపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే జెట్‌ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ఇటు స్పైస్‌ జెట్‌కు.. అటు ఇండిగో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌‌కు మంచిరోజులు వచ్చాయన్న మాట.

More News

ఆరంభంలో స్టాక్ మార్కెట్స్ హుషారు.. సాయంత్రానికి ఆవిరి!

రెండ్రోజుల ముందు వరకు రేసు గుర్రాల్లా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. గురువారం నాడు ఒడిదుడుకుల మధ్య ముగిశాయి.

కన్న తల్లి ఎదుటే ఘోరం.. బ్రిడ్జ్‌పై దూకేసిన కొడుకు

కారులో కుమారుడితో కలిసి తల్లి ప్రయాణం చేస్తోంది. ఏం జరిగిందో ఏమోగానీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి...

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం సాయంత్రం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

ఏపీలో దేవుడికే దిక్కులేదు.. టీటీడీ ఎందుకు స్పందించట్లేదు!

ఆంధ్రప్రదేశ్‌లో దేవుడికే దిక్కు లేదని.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీ ఎన్నికల్లో 12 మంది మంత్రులకు ఓటమేనట!

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన మంత్రులే కాదు సీనియర్లు, రాజకీయ ఉద్ధండులు అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులకు