Download App

ఈసారి మ‌రో స్టార్‌ని విల‌న్ చేస్తున్నారు...

త‌మిళంలో `త‌నీ ఒరువ‌న్` చాలా పెద్ద స‌క్సెస్‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. జ‌యం ర‌వి హీరోగా మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా త‌నీ ఒరువ‌న్ 2 తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

పార్ట్ వ‌న్‌లో అర‌వింద్ స్వామిని విల‌న్‌గా చూపించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్‌లో మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టిని విల‌న్‌గా చూపించ‌బోతున్నార‌ట. యూనిట్ ప్ర‌స్తుతం మమ్ముట్టితో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ట‌. తెలుగులో త‌నీ ఒరువ‌న్ చిత్రాన్ని ధృవ పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రిప్పుడు సీక్వెల్‌లో చ‌ర‌ణ్ న‌టిస్తాడా?  అనేది చూడాలి.