'ఎఫ్ 2' సీక్వెల్ లో మ‌రో స్టార్ హీరో

  • IndiaGlitz, [Wednesday,January 22 2020]

గ‌త ఏడాది ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఎఫ్ 2'. వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్ర‌మిది. గ‌త సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్‌3ని తెర‌కెక్కిస్తామ‌ని ద‌ర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు తెలియ‌జేసిన సంగతి తెలిసిందే.

అయితే త‌ర్వాత అనిల్ రావిపూడికి సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కింది. ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి మ‌హేశ్‌తో చేసిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమా కూడా విజ‌యం సాధించింది. ఈనేప‌థ్యంలో సీక్వెల్ ఎఫ్ 3 మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌.

వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌ల‌తో పాటు మ‌రో స్టార్ హీరో కూడా ఈ సీక్వెల్‌లో న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆ స్టార్ ఎవ‌రో కాదు.. ర‌వితేజ‌. ఇప్ప‌టికే ర‌వితేజ ఈ సినిమా గురించి డైరెక్ట‌ర్ అనిల్ చ‌ర్చ‌లు కూడా జ‌రిపాడ‌ని స‌మాచారం. మ‌రి రవితేజ సినిమా చేయ‌డానికి ఒప్పుకుంటాడో లేదో.. చేస్తే ఈసారి అనిల్ త‌న‌దైన స్టైల్లో ఎలా మెప్పిస్తాడో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

More News

విడాకుల‌పై స్పందించిన శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌

తెలుగులో కొత్త బంగారు లోకంలో హీరోయిన్‌గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన బెంగాళీ బ్యూటీ శ్వేతా బ‌సు ప్ర‌సాద్‌.

అనంతపురంలో ప్రారంభమైన వెంకటేష్ మూవీ 'నారప్ప'

'ఎఫ్‌2', 'వెంకీమామ' వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం 'నారప్ప' రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది.

నిఖిల్ కుమార్ సినిమా నిర్మిస్తున్న లహరి మ్యూజిక్

కన్నడ చిత్రసీమలో తన పర్ఫార్మెన్సుతో మంచి గుర్తింపు పొందడంతో పాటు, తనదైన ముద్రవేశారు యంగ్ హీరో నిఖిల్ కుమార్.

హార్ట్ ట‌చింగ్ మెలోడీ సాంగ్‌తో ఆక‌ట్టుకుంటున్న 'జాను'

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం `జాను`. ఈ సినిమాలో తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 

నేను క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌ను: ర‌జినీకాంత్‌

త‌మిళ‌నాడుకి చెందిన సంఘ సంస్క‌ర్త రామ‌స్వామి పెరియార్‌పై త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ అనుచిత వ్యాఖ్య‌లు చేశాడంటూ..