close
Choose your channels

పరిశీలనలో మరో టైటిల్

Tuesday, August 13, 2019 • తెలుగు Comments

పరిశీలనలో మరో టైటిల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమా టైటిల్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా టైటిల్ విషయంలో ఎప్పటి నుండో చాలా పేర్లు వినపడుతున్నాయి.

`పార్థు`, `అలకనంద`, `నాన్న నేను` పేర్లు టైటిల్‌గా పెట్టే అవకాశం ఉందని అన్నారు. అయితే తాజాగా.. మరో టైటిల్ కూడా వార్తల్లోకి వచ్చింది. బన్నీ తదుపరి చిత్రానికి `వైకుంఠపురంలో..` అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారట. మరి అసలు యూనిట్ ఫిక్స్ అయిన టైటిల్ ఏంటో తెలియాలంటే ఆగస్ట్ 15 వరకు ఆగాల్సిందే.

బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తుంది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz