ఏపీలో తప్పిన రైలు ప్రమాదం.. గేట్‌మెన్ నిర్లక్ష్యం, ఈ లోకో పైలట్ నిజంగా దేవుడే

  • IndiaGlitz, [Saturday,June 03 2023]

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది మరణించడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ప్రమాదంతో దేశవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇటీవలికాలంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రమాదంలో మరణించిన, గాయాలైనవారిలో ఒడిషా, బెంగాల్ వాసులే అధిక సంఖ్యలో వున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, తమిళనాడు వాసులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా వుంటామని తెలిపారు.

గేట్‌మెన్ నిర్లక్ష్యంతో ట్రాక్‌పైకి జనం:

సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో మరో రైలు ప్రమాదం వెంట్రుక వాసిలో తప్పిపోయింది. అది కూడా ఎక్కడో కాదు.. మన ఆంధ్రప్రదేశ్‌లోనే. వివరాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ సమీపంలోని కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది గేటును వేయలేదు. సరిగ్గా అదే సమయంలో నాగర్‌కోయిల్-ముంబై రైలు ఆ మార్గంలో వస్తోంది. అయినప్పటికీ జనం ట్రాక్‌పై అటు ఇటు తిరిగారు. అయితే కొందరు స్థానికులు రైలు రాకను గమనించి వెంటనే తమ వాహనాలను నిలిపివేశారు. కానీ కొందరు నిర్లక్ష్యంగా ట్రాక్ దాటేందుకు ప్రయత్నించారు. వీరిని గమనించిన లోకో పైలట్ తక్షణం స్పందించి రైలును నిలిపివేశారు.

లోకో పైలట్ సమయస్పూర్తి :

ఆపై రైలును దిగి అక్కడి గేట్‌మ్యాన్ రూమ్‌కి వెళ్లిన లోకో పైలట్.. లోపల ఎవరైనా వున్నారేమోని చూశారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో వాకీటాకీ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు . దీనిని చూసిన స్థానికులు గేట్‌మెన్ సకాలంలో స్పందించకుంటే పెను ప్రమాదం జరిగేదని చెబుతున్నారు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.

 

More News

Ram Charan: ఒడిషా రైలు ప్రమాదంపై రామ్ చరణ్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు సంతాపం

శుక్రవారం రాత్రి ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ ప్రజలను విషాదంలోకి నెట్టింది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ఈ దారుణం జరిగింది.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మరో అట్రాక్షన్: మ్యూజిక్ డైరెక్టర్ అతుల్ సాహసం.. బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘‘ఆదిపురుష్’’. ఎన్నో అవాంతరాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.

చరిత్ర సృష్టించిన మోడీ : యూఎస్ కాంగ్రెస్ ఆహ్వానం .. చర్చిల్, మండేలా తర్వాత ఆ ఘనత

అంతర్జాతీయంగా తన పలుకుబడిని పెంచుకోవడమే కాకుండా ఆయా దేశాలతో భారతదేశానికి కూడా సంబంధాలు మెరుగుపరుస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గడిచిన 9 ఏళ్ల కాలంలో భారత దౌత్య విధానం పూర్తిగా మారిపోయింది.

Travel Insurance: 0.45 పైసలతో రూ.10 లక్షల ప్రమాద బీమా.. టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ స్కిప్ చేస్తున్నారా..?

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మంది మరణించడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది.

Pawan Kalyan: ఒడిషా రైలు ప్రమాదం.. ఇకనైనా భద్రతా చర్యలు తీసుకోండి : కేంద్రానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని