ప్రభాస్ సినిమాలో మరో విలన్..

  • IndiaGlitz, [Monday,July 24 2017]

బాహుబ‌లి చిత్రంతో నేష‌న‌ల్ రేంజ్‌లో స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్నాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'సాహో'. భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లై ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అల్రెడి సినిమా చిత్రీక‌ర‌ణను జ‌రుపుకుంటుంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో సినిమాను 150 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేష్ ఓ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో నీల్ నితిన్‌తో పాటు చంకీ పాండే అనే మ‌రో బాలీవుడ్ న‌టుడు కూడా విల‌న్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నాడ‌ట‌. శంక‌ర్ ఎహ్‌సాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. సినిమా యూనిట్ హీరోయిన్ అన్వేషణ‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. దీనితో పాటు త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.

More News

నయనతార 'వాసుకి' సాంగ్ రిలీజ్ చేసిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ 'వాసుకి'సినిమాలోని సాంగ్ ను విడుదల చేశారు.

అమెరికా ఓహియో ఇంటర్ నేషనల్ ఫిలిం పెస్టివల్ లో ఉత్తమ నటుడిగా 'రక్తం' కు గానూ నామినేట్ అయిన బెనర్జీ!

తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అంటే అంతంత మాత్రమే.

అక్టోబర్ 13న విడుదలకానున్న 'రాజుగారి గది 2'

కింగ్ నాగార్జున కథానాయకుడిగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ థ్రిల్లర్ "రాజుగారి గది 2".

హ్యాపీ బర్త్ డే టు యూనిక్ స్టార్ విజయ్ ఆంటోని

సంగీత దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోని తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాకు అద్భుతమైన సంగీతానందించారు. మ్యూజిక్ డైరెక్టర్గా, దర్శకుడిగా, సింగర్గా, యాక్టర్గా, నిర్మాతగా ఇప్పుడు అన్ని రంగాల్లో తనదైన శైళిలో రాణిస్తున్నారు.

'ఫిదా' టీమ్ ను అభినందించిన సీఎం కె.సి.ఆర్

వరుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఫిదా`.