'ఇండియ‌న్ 2' లో మ‌రో యువ న‌టుడు

  • IndiaGlitz, [Wednesday,November 14 2018]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆలోపు ఆయ‌న రెండు సినిమాల‌ను పూర్తి చేస్తారు. అందులో ఒక‌టి 'ఇండియన్ 2'.. మ‌రో చిత్రం 'క్ష‌తియ‌పుత్రుడు 2'.

ఇందులో ముందుగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఇండియ‌న్ 2' చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇందులో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి.

కాగా ఇప్పుడు మ‌రో యువ క‌థానాయ‌కుడు శింబు కూడా ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. రీసెంట్‌గా సెట్స్ వ‌ర్క్ కూడా స్టార్ట‌య్యింది. త్వ‌ర‌లోనే తొలి షెడ్యూల్ యూర‌ప్‌లో ప్రారంభం కానుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై త్వ‌ర‌లోనే సినిమా ప్రారంభం కానుంది.