ఫ‌స్ట్‌డే 1.26 కొట్ల గ్రాస్ వసూలుచేసిన‌ రష్మి గౌత‌మ్‌ 'అంతం'

  • IndiaGlitz, [Friday,July 08 2016]

'గుంటూరు టాకీస్ త‌రువాత రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మిగౌతమ్ హీరోయిన్ గా విడుద‌ల‌యిన చిత్రం 'అంతం'. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు.చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. 300 ధియోట‌ర్స్ కి పైగా ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో జులై 7న విడుద‌ల చేశారు. విడ‌దల‌యిన అన్ని సిటీస్ లో స్పీడ్ ఫుల్స్ తో, టౌన్స్ లో 90% ఓపెనింగ్ తో మెద‌టిరోజునే 1.26 కొట్ల గ్రాస్ ని వ‌సూలు చేసి ఇండిపెండెంట్ చిన్న చిత్రాల్లో రికార్డు గా నిలిచింది.

ఈ సందర్బంగా దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ మాట్లాడుతూ.... మా 'అంతం చిత్రం 300 దియోట‌ర్స్ లొ విడుద‌ల‌య్యి మెద‌టిరోజు 1.26 కొట్ల గ్రాస్ వ‌సూలు చేయ్య‌టం చాలా ఆనందంగా వుంది. చాలా రీజ‌న్‌బుల్ రేట్స్ కి మా డిస్ట్రిబ్యూట‌ర్స్ కి ఇచ్చాము. వారంద‌రూ రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతాం అంటున్నారు. ఇండిపెండెంట్ చిన్న చిత్రాలు విడుద‌ల కావ‌టమే చాలా క‌ష్టంగా వున్న ఈరోజుల్లో మా చిత్రం విడుద‌ల ముందు బిజినెస్ కావ‌టం, గ్రాండ్ రిలీజ్ కావ‌టం. మెద‌టిరోజు రికార్డు క‌లెక్ష‌న్ రావ‌టం చాలా ఆనందంగా వుంది.గుంటూరు టాకీస్ చిత్రం త‌రువాత‌ రష్మీ గౌతమ్ న‌టించిన చిత్రం కావ‌టం, రంజాన్ ప‌ర్వ‌దినం కావ‌టం మా చిత్రానికి తెలుగు ప్రేక్ష‌కులు భారీ ఓపెనింగ్ ఇచ్చారు. వారంద‌రికి మాధ‌న్య‌వాదాలు.అని అన్నారు.

నటీనటులు

రష్మీ గౌతమ్, చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్

సాంకేతిక వర్గం

ప్రొడక్షన్ బ్యానర్ - చరణ్ క్రియేషన్స్

సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, డిఐ - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్

మ్యూజిక్ - కార్తిక్ రోడ్రిగ్జ్

స్టంట్స్ - రామ్ సుంకర

సౌండ్ ఎఫెక్ట్స్ - ఎతిరాజ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు

స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్

More News

సురేష్ బాబు చేతుల మీదుగా పెళ్ళి చూపులు ఆడియో విడుదల

విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పెళ్లి చూపులు. ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌, వినూత్న‌ గీత బ్యానర్స్ పై రాజ్ కందుకూరి, యస్ రాగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

గోవుల మ‌ధ్య గోపాలుడు...

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ప్ర‌కృతి అన్నా, ప‌శువులు అన్నా ఎంతో ఇష్టం. అందుకే స‌మ‌యం దొరికితే చాలు...త‌న ఫామ్ హౌస్ లో ప్ర‌కృతి, ప‌శువుల మ‌ధ్య ఎక్కువ గ‌డ‌ప‌డానికి ఇష్ట‌ప‌డుతుంటాడు.

ఆ డైరెక్ట‌ర్ న‌న్ను మోసం చేసాడంటున్న రేష్మి..

గుంటూరు టాకీస్ చిత్రంలో త‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకున్న రేష్మి తాజా చిత్రం అంతం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ తెర‌కెక్కించారు.

మ‌హేష్ హీరోయిన్ మారుతుందా...?

బ్రహ్మోత్సవం తర్వాత సూపర్ స్టార్ మహేష్ తన తదుపరి చిత్రం వాస్కోడిగామా(వినపడుతున్న పేరు) కోసం రెడీ అయిపోతున్నాడు. ఎన్.వి.ప్రసాద్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎ.ఆర్.మురగదాస్ తెరకెక్కించబోతున్నాడు.

సూర్య కోసం వ‌చ్చేస్తున్నశృతిహాస‌న్..

అందాల క‌థానాయిక శృతిహాస‌న్...ప్ర‌స్తుతం విదేశాల్లో క‌మ‌ల్ హాస‌న్ తెర‌కెక్కిస్తున్న శ‌భాష్ నాయ‌డు షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ చిత్రంలో క‌మ‌ల్ కి భార్య‌గా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా, కూతురుగా శృతిహాస‌న్ న‌టిస్తుంది.