మహిళలకు గుడ్ న్యూస్.. యాంటీ ‘రేప్’ చీర‌లొచ్చేశాయ్!

  • IndiaGlitz, [Monday,May 13 2019]

భారతదేశంలో ఫ్యాషన్లకు ఏ మాత్రం కొదువలేదు.. టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అంతకు రెట్టింపు స్థాయిలో ఫ్యాషన్ కూడా రెట్టింపు అవుతోంది. బట్టల విషయానికొస్తే ఎక్కడా లేని.. దొరకని డిజైన్స్ మెట్రో నగరాల్లో దొరుకుతుంటాయ్. కొన్ని చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉన్నా.. మరికొన్ని మాత్రం చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. కొందర్ని కొన్ని కొన్ని ఫ్యాషన్ దుస్తుల్లో చూస్తే అబ్బా అనిపిస్తుందంతే. అందుకే ఎక్కడ చూసిన కుప్పలు తెప్పలుగా.. గల్లీ గల్లీలో పదుల సంఖ్యలో పుట్టగొడుగుల్లా బట్టల షాపులుంటాయ్..! ఈ ఫ్యాషన్ రంగానికి ఏ మాత్రం గిరాకి తగ్గే పరిస్థితుల్లేవ్. 

ఇక అసలు విషయానికొస్తే.. ఆడవాళ్లు వేసుకునే బట్టలు వల్ల ఎక్కువగా రేప్‌లు జరుగుతుంటాయ్.. వాళ్లు డ్రస్సింగ్ స్టైల్ సరిగ్గా ఉండదు.. ఏది దాచుకోవాలో వాటిని బయటికి చూపిస్తుంటారు అందుకే లేనిపోని అనర్థాలు జరిగిపోతుంటాయని విమర్శకులు విమర్శలు గుప్పిస్తుంటారు.! అంతేకాదు.. మ‌న దేశంలో మ‌హిళ‌లు వేసుకునే డ్రెస్సుల‌పై ఎప్ప‌టి నుంచో వివాదాలు న‌డుస్తున్న విష‌యం విదిత‌మే. ఇటీవల ఢిల్లీలో ఇటీవ‌లే ఓ మ‌హిళ రెస్టారెంట్‌కు వెళ్లగా.. అక్కడ పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు ఆమెకు క‌నిపించగా..వారిపై ఆ మ‌హిళ అస‌భ్యక‌ర కామెంట్లు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ‌హిళ చేసిన వ్యాఖ్యల‌ను సీరియస్‌గా కొందరు యూత్ ఓ స్వచ్ఛంద సంస్థ యాంటీ రేప్ చీర‌ల పేరిట కొన్ని ప్రత్యేక‌మైన చీర‌ల‌ను డిజైన్ చేసి వాటిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది.

ఇలాంటి చీరల కొనుగోలుకు ఇదిగో సంప్రదించండి అంటూ.. ఒక వెబ్ సైట్ అందుబాటులోకి తెస్తోంది. ఈ సైట్‌లో రకరకాలు చీరలు పలు డిజైన్స్‌లో ఉన్నాయి. ముఖ్యంగా శరీరం మొత్తం కప్పి ఉంచే చీరలే ఇవన్నీ. చేతులు మొదలుకుని ముఖం.. పాదాల వరకు అన్ని భాగాలు కప్పే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బురఖాలో చీరలున్నాయ్. కాగా.. ఇలాంటి దుస్తులను డిజైన్ చేసిన స్వచ్ఛంద సంస్థపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు... ఈ సంస్థ తయారు చేసిన చీరలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చీర కట్టుకుని బయటికెళ్లే మహిళల ముఖ భాగంలో కళ్లు, జుట్టు తప్ప ఇంకేం కనపడవ్. ఈ చీరలు కొనుగోలుకు  చేయడానికి యూత్ బాగా ఇష్టపడుతున్నారు. సో.. ఒక రకంగా చెప్పాలంటే ఇది మహిళలకు గుడ్ న్యూసే అని చెప్పుకోవచ్చు మరి.

More News

స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ సరే.. ఒప్పుకున్నారా!?

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌తో ఢిల్లీలో చక్రం తిప్పాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే.

వీహెచ్‌ వ్యవహారంలో నగేశ్‌కు షాకిచ్చిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)పై ఇటీవల అఖిలపక్షం ధర్నాలో పీసీసీ కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.

రొమాంటిక్ క్రిమినల్స్ అందరినీ మెప్పిస్తుంది : సునీల్ కుమార్ రెడ్

ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌ క‌థ‌ లాంటి సందేశాత్మ‌క, క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రాలు అందించ‌డమే కాకుండా కంటెంట్ వున్న చిత్రాల‌కు పెద్ద బ‌డ్జెట్ అవ‌స‌రం లేద‌ని నిరూపించి టాలీవుడ్

బాలీవుడ్‌లో అంచనాలు పెంచేస్తున్న 'కబీర్ సింగ్'

విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటీనటులుగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో కొత్తగా చెప్పనక్కర్లేదు.

'ఫలక్‌ నుమా దాస్‌' ట్రైలర్‌ చాలా బాగుంది, సినిమా బ్లాక్‌బ్లస్టర్‌ హిట్‌ కావాలి - వెంకటేష్‌

'వెళ్ళిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది' లాంటి చిత్రాలలో తనదైన నటనతో మంచి గుర్తిపు తెచ్చుకున్నారు నటుడు విశ్వక్‌ సేన్‌. ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఫలక్‌ నుమా దాస్‌'.